హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన ‘వివాహిత’ కిడ్నాప్ కేసు మరో కొత్త మలుపు తిరిగింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తితో పారిపోవాలని భావించిన ఆమె.. తన ప్రియుడితో కలిసి కిడ్నాప్ కథ అల్లినట్లు పోలీస్ విచారణలో వెల్లడైంది. దీంతో ఈ కిడ్నాప్ కథను అల్లిన ఆ వివాహిత భర్తతోపాటు పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళ్లే.. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్కు చెందిన రాధిక అనే వివాహిత కొన్నిరోజుల క్రితం కిడ్నాప్ కు గురయ్యింది. బీహార్ కు చెందిన రిజ్వాల్ అనే ఓ వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసి ఒడిశా మీదుగా కోల్ కతా తరలించాడు. అక్కడికి వెళ్లిన అనంతరం ఆమెను విడిచిపెట్టాల్సంటే రూ.3 లక్షలు ఇవ్వాలంటూ బాధితురాలి భర్తకు వాట్సాప్ ద్వారా డిమాండ్ చేశాడు. అంతేకాదు.. ఆమెను కొట్టిన దృశ్యాల్ని సైతం భర్తకు పంపించాడు. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే ఆమెను ముంబైలోని ‘రెడ్ లైట్’ ఏరియాలో అమ్మేస్తానని.. బెదిరించాడు కూడా! దీంతో ఆ బాధితురాలి భర్త సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి.. చాకచక్యంగా ఆ కిడ్నాపర్ ను పట్టుకుని.. అతడి చెరనుంచి రాధికను విడిపించారు. ఈ కిడ్నాప్ వెనుక అసలు కథేంటోనని పోలీసులు విచారించగా.. అందరిని షాక్ కు గురయ్యేలా చేసే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసు వెనుక దాగిన విషయం ఏమిటంటే.. వివాహిత రాధికకు, ఆమె భర్తతో కొన్ని విభేదాలున్నాయి. వారి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వుండేవి. ఇదే సమయంలో 2011లో ఆమెకు రిజ్వాల్ అనే వ్యక్తితో సోషల్ మాధ్యమం ద్వారా పరిచయం అయ్యాడు. వారి మధ్య ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. అందుకు ఓ పథకం పన్నారు. ముందుగా ఇంటినుంచి పారిపోయిన వారిద్దరూ.. కిడ్నాప్ నాటకానికి తెర తీశారు. ఎందుకంటే.. వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో.. భర్తను బెదిరించి డబ్బు సంపాదించాలని భావించారు. ఆ ప్లాన్ ప్రకారమే రాధికను చిత్రహింసలు చేసినట్లుగా డమ్మీ గాయాలతో రిజ్వాల్ ఆమె భర్తకు వాట్పాప్ కు ఫోటో పంపాడు. ఈ కిడ్నాప్ నాటకంలో భాగంగా వీరిద్దరూ కోల్ కతాకు పారిపోయారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించటంతో అసలు గుట్టు రట్టయ్యింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more