pawan kalyan controversial tweets on congress party over special status issue | Bjp party

Pawan kalyan controversial tweets on congress party over special status issue

pawan kalyan, pawan kalyan twitter, pawan kalyan latest updates, congress party, ap special status, lalit modi money scam, ap controversy, bjp party

pawan kalyan controversial tweets on congress party over special status issue : Janasena president fires on congress party over in ap special status controversy.

‘అన్నయ్య’ పార్టీపై ‘తమ్ముడి’ వ్యంగ్యాస్త్రాలు..

Posted: 07/13/2015 02:20 PM IST
Pawan kalyan controversial tweets on congress party over special status issue

‘అన్నయ్య’ (చిరంజీవి) వున్న కాంగ్రెస్ పార్టీ మీద నిత్యం అంతెత్తున ఎగిసిపడే పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కల్యాణ్.. ఈసారి ఆ పార్టీపై అపర అభిమానాన్ని చాటిచెప్పారు. ‘కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ప్రేమ.. ఆ పార్టీని నేను ఆరాధిస్తున్నాను’ అంటూ పవన్ వ్యాఖ్యలు చేసి మరోసారి సంచలనం సృష్టించారు. అయితే.. ఈ అభిమానం ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చూపించడం లేదులెండి.. ఆ పార్టీ పయనిస్తున్న మార్గం సరైనదని కాదని తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘కాంగ్రెస్ అంటే నాకు ఎంతో ప్రేమ. ఆ పార్టీని నేను ఆరాధిస్తున్నాను. ఎందుకంటే.. ఒక్క లలిత్ మోదీ అంశంపై ఆ పార్టీ బీజేపీ ప్రభుత్వంపై పోరుకు సాగిస్తోంది. కానీ 5 కోట్ల ఏపీ ప్రజలకు ఇచ్చిన ‘ఏపీకి ప్రత్యేక హోదా’ హామీ అమలు కోసం సాగించాల్సిన పోరుకంటే.. కాంగ్రెస్ లలిత్ మోదీ అంశమే ప్రధానమైంది. అటువంటి పార్టీని ప్రస్తుతించండి’ అంటూ పవన్ కల్యాన్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యంగ్యాస్త్రాలు చేశారు. మరి.. ఈయన కామెంట్లపై కాంగ్రెస్ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే!

అటు.. సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే! కానీ.. ఇప్పుడు ఆ అంశంపై బీజేపీ ప్రభుత్వం అస్సలు మాట్లాడటం లేదు. ఇటువంటి సమయంలో.. ఆర్థిక పరిస్థితుల్లో కూరుకుపోయిన ఏపీకి మద్దతుగా, 5 కోట్ల ఆంధ్రుల ప్రధాన సమస్య అయిన ‘ప్రత్యేక హోదా’ సమస్యపై కాంగ్రెస్ పోరాటం సాగించకుండా.. కేవలం లలిత్ మోదీ అంశాన్ని అస్త్రంగా చేసుకుని బీజేపీ మీద పోరుకు దిగిందని ఆయన వివరించారు.

pawan-kalyan-tweets

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  ap special status  lalit modi scam  bjp party  congress party  

Other Articles