Hollywood and B-town mourns legendary Omar Sharif's demise

Legendary actor omar sharif dies at 83

Legendary actor Omar Sharif dies at 83, Hollywood and B-town mourns legendary Omar Sharif's demise, hollywood, hollywood actor, Omar Sharif, cairo, Lawrence of Arabia, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, africa, news, entertainment news

Actor Omar Sharif, best known for his portrayal of Doctor Zhivago in the hit 1966 film and for his work in "Lawrence of Arabia", died of a heart attack on Friday, his agent said. He was 83.

హాలీవుడ్ నటుడు ఒమర్ షరీఫ్ కన్నుమూత

Posted: 07/11/2015 09:00 PM IST
Legendary actor omar sharif dies at 83

ప్రముఖ హాలీవుడ్ నటుడు ఒమర్ షరీఫ్‌(83) గుండె పోటుతో మరణించారు. ఆల్జీమర్స్ వ్యాధితో కొంతకాలంగా భాధ పడ్తున్న ఆయన గుండె పోటు రావడంతో చనిపోయారు. లారెన్స్ ఆఫ్ అరేబియా, డాక్టర్ ఝివాగో వంటి సినిమాల్లో అద్భుతంగా నటించిన ఒమర్ షరీఫ్ అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నారు. లారెన్స్ ఆఫ్ అరేబియాలో నటనకు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ఒమర్ అదే సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకున్నారు. తన సహ నటి ఫాతెన్ హమామాను షరీఫ్ వివాహమాడారు. రెండేళ్ళ క్రితం వచ్చిన రాక్ ద కాస్బా అతని చివరి చిత్రం.

తొలితరం మేటి నటుల్లో ఒకరైన ఒమర్ ఈజిప్టులో తుక్కు వ్యాపారం చేసే వారింట 1932లో జన్మించారు. పుట్టుకతో గ్రీక్ క్యాథలిక్ అయిన షరీఫ్ 1955లో ఇస్లాం మతం స్వీకరించారు. నటనపై ఆసక్తితో లండన్‌లోని 'రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమెటిక్ ఆర్ట్'లో నటనకు సంబంధించిన మెళకువలు నేర్చుకున్నారు. 1954లో 'సిర్రా ఫిల్-వాడి' అనే ఈజిప్టియన్ చిత్రంతో నటనా ప్రయాణాన్ని ప్రారంభించారు. మెకన్నాస్ గోల్డ్, లారెన్స్ ఆఫ్ అరేబియా, డాక్టర్ జివాగో, ది టెన్ కమాండ్ మెంట్స్, ది మెమొరీస్ ఆఫ్ మిడ్ నైట్ లాంటి చిత్రాలతో దూసుకుపోయారు.

దాదాపు 70 చిత్రాల్లో ఒమర్ నటించారు. ఇలా ఛాన్సులపై ఛాన్సులతో తీరికలేకుండా గడిపిన ఒమర్‌కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చే గువేరా, చెంఘిజ్ ఖాన్ తదితర గొప్ప చారిత్రక పురుషుల క్యారెక్టర్లలో ఒమర్ అద్భుతంగా ఒదిగిపోయారు. షరీఫ్ మృతి పట్ల హాలీవుడ్ నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటు బాలీవుడ్ కూడా ఒమర్ మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hollywood  Omar Sharif  cairo  Lawrence of Arabia  

Other Articles