పుండు మీద కారం చల్లినట్లు ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఓటుకు నోటు వ్మవహారంలో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న చంద్రబాబుకు తాజాగా వికిలీక్స్ మరో దెబ్బ తీసింది. ఏపి ప్రభుత్వం ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలు చేసేందుకు సిద్దపడిందని, దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలతో బేరం కూడా కుదిరిందని కూడా వికీలీక్స్ వెల్లడించింది. అయితే ట్యాపింగ్ చేసేందుకు ఉద్దేశించిన టెక్నాలజీ ఎవరి కోసం అన్నదాని మీదే ప్రశ్న తలెత్తుతోంది. అయితే తాజాగా నమస్తే తెలంగాణలో దీని మీద ప్రత్యేకంగా కథనం ప్రచురించారు. అయితే చంద్రబాబు నాయుడు ట్యాపింగ్ టెక్నాలజీ వాడడానికి సిద్దపడ్డారని, ట్యాపింగ్ మీద తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపట్టడాన్ని తప్పుపడుతున్నట్లు కథనాన్ని ప్రచురించింది. అయితే దీనిపై ఏపి ప్రభుత్వం ఇచ్చే వివరణ ఎంతో కీలకం.
Also Read: ఫోన్ ట్యాపింగ్ అంశంలో డీజి అనురాధపై బదిలీ వేటు
ఏపి సిఎం చంద్రబాబు నాయుడు తమ ఫోన్లను ట్యాప్ చేసిందని అందుకు తగిని ఆధారాలు కూడా ఉన్నాయని ఏపి సర్కార్ తీవ్రంగా మండిపడుతోంది. తెలంగాణ సర్కార్ తమ మీద పరోక్షంగా నిఘా ఉంచిందని.. హైదరాబాద్ కేంద్రంగా వ్యవహారం నడుస్తోందని కాబట్టి సెక్షన్ 8 అమలు చెయ్యాలని ఒకే సారి ట్యాపింగ్, సెక్షన్ 8లను తెర మీదకు తీసుకువచ్చారు చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పటికే ట్యాపింగ్ మీద సిట్ ను వేసి విచారణ కూడా చేస్తున్నారు. తాజాగా వికిలిక్స్ ప్రకారం సెల్‌ఫోన్లు, ఈ మెయిల్ సమాచారాన్ని దొంగచాటుగా ట్యాపింగ్ చేసే టెక్నాలజీని సమకూర్చుకునేందుకు ఆయన తీవ్రంగా యత్నించారు. ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కన్సల్టెన్సీ సంస్థద్వారా బేరసారాలు నడిపింది. సుమారు 7.5 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ టెక్నాలజీ కొనుగోలుకు సిద్ధమైంది. ఈ సంగతులు వికీలీక్స్ పరిశోధనలో బయటపడ్డాయి.
Also Read: ట్యాపింగ్ నిజమే.. ఇక సిట్ దూకుడే
మామూలుగా అయితే ఉగ్రవాదుల కదలికల మీద నిఘా విభాగం ఇలా ట్యాపింగ్ చేస్తుంది. దేశ భ్రదత నేపథ్యంలో ట్యాపింగ్ చెయ్యడం మామూలే. అయితే ఏపి ప్రభుత్వం అంత తొందరగా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ప్రశ్న. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మెయిళ్లు, సెల్‌ఫోన్ల సంభాషణలపై నిఘాపెట్టి ట్యాపింగ్ చేసే టెక్నాలజీని అమ్మే సంస్థలు అనేకం ఉన్నాయి. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాల మీద నిఘాకోసమంటూ ఈ సంస్థలు అమ్మే సాఫ్ట్ట్‌వేర్‌ను చట్టవ్యతిరేక పనుల్లో వాడుతున్నారు. ఇలా అక్రమంగా హ్యాక్ చేసిన సుమారు 10 లక్షల ఈమెయిళ్లను వికీలీక్స్ బయటపెట్టింది. సెల్‌ఫోన్లు, డెస్క్‌టాప్‌ల మీద నిఘా పెట్టే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి తెలంగాణ మీద ప్రయోగించేందుకు ఏపీ ప్రభుత్వం పూనుకుందని నమస్తే తెలంగాణ పేర్కొంది. సదరు టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు జూబ్లీహిల్స్‌లోని ఓర్టస్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థతో సంప్రదింపులు నడిపారు.
Also Read: సర్వీస్ ప్రొవైడర్లు ట్యాపింగ్ పై ఏం మాట్లాడారు..?
వీరికోసం ఓర్టస్ కంపెనీ డైరెక్టర్ కాసు ప్రభాకర్‌రెడ్డి ఇలాంటి టెక్నాలజీని విక్రయించే హాకింగ్‌టీమ్.కామ్ అనే సంస్థతో బేరసారాలు జరిపారు. 25నుంచి 50 సెల్‌ఫోన్ల నంబర్లపై ట్యాపింగ్ జరిపేందుకు టెక్నాలజీ కావాలని హాకింగ్‌టీమ్‌కు ఆర్డర్ చేశారు. ఇందుకు సంబంధించిన ఈ-మెయిళ్లు శుక్రవారం వెలుగు చూశాయి. ప్రాథమికంగా ఏడున్నర కోట్ల రూపాయలు చెల్లించి ఆ టెక్నాలజీని అమ్మేందుకు కన్సల్టెన్సీ జరిపిన సంప్రదింపుల కేబుళ్లను వికీలీక్స్ బయటపెట్టింది. బయటపడ్డ కేబుళ్లలోని సమాచారం ప్రకారం జూన్ 12న ఓర్టస్ కంపెనీ డైరెక్టర్ ప్రభాకర్ సింగపూర్‌లోని హాకింగ్ టీమ్ సింగపూర్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ చీఫ్ డేనియల్ మగ్లిట్టాతో ఈ మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపారు. సుమారు 20నుంచి 50 మ్బైల్ లైసెన్స్‌లు అర్జంటుగా కావాలని అందులో కోరారు. దీనిపై స్పందించిన హాకింగ్‌టీమ్ ప్రతినిధి మగ్లిట్టా, ప్రభాకర్‌రెడ్డి పంపిన ప్రతిపాదనను పరిశీలించినట్టు ధృవీకరిస్తూ ఆయన కోరిన సాప్ట్‌వేర్ కావాలంటే సుమారు 7.5 కోట్ల రూపాయలు అవుతుందని, అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని స్పష్టం చేశారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు
మొత్తానికి చంద్రబాబు నాయుడు ఇలా ట్యాపింగ్ టెక్నాలజీని నిజంగా ఉగ్రవాదుల ఫోన్లను ట్యాప్ చెయ్యడానికో లేదా ఉగ్రవాదుల సమాచారాన్ని తెలుసుకోవడానికి వాడతారో తెలియదు. అయితే వికిలీక్స్ వివరించిన వివరాల్లో నిజం ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అయితే ప్రభుత్వం నిఘా కోసం తీసుకునే చర్యల మీద ఎలాంటి వివరాలను బయటకు రాకుండా చూసుకుంటుంది. అలాంటప్పుడు ఏపి ప్రభుత్వం వాటి వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని కానీ వికీలీక్స్ దానిని బయటపెట్టిందని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి నిఘా కార్యక్రమాలను గుట్టుచప్పుడు కాకుండా నడుపుతుందని కానీ వివరాలను బయటపెట్టదు. మరి అలాంటప్పుడు ఏపి ప్రభుత్వం చేస్తే దాన్ని తప్పు అని ఎలా అంటారు అని కొంత మంది వాదన. కాదు కాదు కేవలం తెలంగాణ మీద ప్రయోగించడానికే ట్యాపింగ్ టెక్నాలజీని కొనుగోలు చేస్తున్నారని కొంత మంది అంటున్నారు.
(Source: Namasthetelangaana)
By Abhinavachary
Also Read: ట్యాపింగ్ పై ఏపి ఇక దూకుడు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more