Nitish Kumar says council poll no reflection of people's opinion

Will ban liquor if i retain power in bihar says nitish kumar

Will ban liquor if I retain power in Bihar, says Nitish Kumar, Nitish Kumar says council poll no reflection of people's opinion, Alcohol, bIhar, Bihar CM, Booze, CM, Government, Liquor, Nitish Kumar, Patna, Women, prohibition on liquor, ban on liquor, council poll, no reflection of people's opinion, Bihar assembly elections, assembly polls, Bihar chief minister Nitish Kumar, Bihar liquor ban

As polling season approaches, out come the grand promises. Acceding to the demands made by the women of his state, Bihar Chief Minister Nitish Kumar on Friday promised to impose a ban on liquor when he forms the government next time.

మళ్లీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్య నిషేధం

Posted: 07/10/2015 10:30 PM IST
Will ban liquor if i retain power in bihar says nitish kumar

బీహార్‌లో సెమీ ఫైనల్‌గా భావిస్తోన్న విధాన పరిషత్ ఎన్నికల్లో అధికార జేడియు, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటములు షాక్ తిన్నాయి. ఈ ఎన్నికలలో బిజెపి విజయఢంకా మోగించింది. మొత్తం 24 సీట్లకు గాను పన్నెండింటిని గెలుచుకుని సత్తా చాటింది. ఎన్డియే కూటమిలోని ఇతర పార్టీలకు మరో రెండు సీట్లు వచ్చాయి. ఎన్నికల్లో జట్టుగా ఏర్పడి కలిసికట్టుగా పోరాడిన ఆర్జేడీ, జెడియూ, కాంగ్రెస్‌లు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయి. జెడియూ 5, ఆర్జేడీ 3, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచాయి. సెమీఫైనల్లో తాము ఓడిపోయినా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి తప్పకుండా గెలుస్తుందని నితీశ్-లాలూ ధీమా వ్యక్తం చేశారు.

దీంతో నితీష్ కుమార్ భీహార్ మహిళల ఓట్లకు గాలం వేశారు. త్వరలో రానున్న ఎన్నికలలో తమ కూటమి మరోమారు అధికారంలోకి వస్తే.. బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మధ్యపాన నిషేదాన్ని విధిస్తామని ఆయన హామి ఇచ్చారు. మరోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళల ఓట్లపై కన్నేసిన ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. మరో రెండు మూడు నెలలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడితో కలసి జేడీయూ ఎన్నికల బరిలోకి దిగుతోంది. కాగా ఇప్పటికే బీజేపి చాపకింద నీరులా ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా, జేడీయు కూడా ప్రచారాన్ని ప్రారంభించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar assembly elections  ban on liquor  council poll  nitish kumar  bihar  

Other Articles