Battered, Bruised Teenager Tortured By Stepmother

Aware doctors released pratyusha health bulletin

aware doctors released pratyusha health bulletin, pratyusha, aware global hospital, heath bulletin, step mother, chamundeshwari, LB nagar police, human rights commision, severe punishment, Girl rescued, Child Rights Group, Child Rights Protection Commission, Child rauma, Torture, Telangana, Hyderabad

Pratyusha, 19, told the team that she had been tortured for a year and a half by her stepmother, Chamundeshwari.

మనుషులు కాదు వాళ్లు మానవ మృగాలు.. వారిన కఠినంగా శిక్షించండి

Posted: 07/10/2015 07:16 PM IST
Aware doctors released pratyusha health bulletin

సవతి తల్లి చేతిలో చిత్రహింసలను అనుభవించి.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న ప్రత్యూష తొలిసారిగా ఈ వ్యవహారంపై స్పందించింది. తన కన్న తండ్రికి, తన సవతి తల్లిని కఠినంగా శిక్షించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపింది. ఎల్బీనగర్ లోని అవేర్ అసుప్రతిలో చికిత్స పోందుతున్న ప్రత్యూష తన అవేదనను మీడియాతో పంచుకుంది. తాను వాళ్లకు పట్టలేదనే కారణంతో ఏడాది కాలంగా తనను టార్చర్ పెడుతూ వచ్చారని వాపోయింది. తనను ప్రతీ క్షణం మానసికంగా, శారీరికంగా చాలారోజుల నుంచి వేధిస్తున్నారని వెల్లడించింది. ఏడాది కాలంగా గదిలో నిర్భంధించి తనను చిత్రహింసలు పెట్టారని తెలిపింది. ముఖ్యంగా ప్రత్యూష తల్లి చాముండేశ్వరి ఏడాది కాలంగా తనను హింసించారిన తెలిపింది.

హెల్త్ బులిటిన్ విడుదల

సవతి తల్లి చేతిలో చిత్రహింసల పాలైన ప్రత్యూష ఆరోగ్యంపై అవేర్ అస్పత్రి వైద్యులు హెల్త్ బులిటన్ విడుదల చేశారు. ప్రస్తుతం ప్రత్యూష ఆరోగ్యం నిలకడగానే వుందని, ఆమె క్రమంగా కోలుకుంటుందని చెప్పారు. మరో వారం రోజుల పాటు వైద్య చికిత్స చేసిన తరువాత అమెను డిశ్చార్చ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ప్రత్యూష శరీరంపై బలమైన గాయాలున్నాయిన, అన్నింటీకీ చికిత్స చ ేసినట్లు చెప్పారు. అమె అంతర్గత అవయాలపై కూడా యాసిడ్ తో దాడిచేశారని, సిగరెల్లతో కాల్చి, యాసిడ్ కూడా తాగించినట్లు అవేర్ వైద్యులు వెల్లడించారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ప్రత్యూషకు రీనల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో గ్యాస్ట్రో , గైనాకలాజీ, పల్మనాలజీ విభాగాల వైద్యులతో ప్రతే్యకంగా చికిత్స నందిస్తున్నట్లు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pratyusha  aware global hospital  heath bulletin  step mother  severe punishment  

Other Articles