Paisatan | India | Atom Bomb | Defence Minister | Khwaja Asif

Pakistan defence minister khwaja asif contraversial comments on the india

Paisatan, India, Atom Bomb, Defence Minister, Khwaja Asif

Pakistan Defence minister Khwaja Asif contraversial comments on the India. He said that Pakistan dont go away on Atom bomb.

డిక్కీ బలిసిన పాకిస్థాన్.. భారత్ మీద తొడ కొడుతోంది

Posted: 07/08/2015 04:17 PM IST
Pakistan defence minister khwaja asif contraversial comments on the india

డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొట్టిందట అని తెలుగు సినిమాలో మహేష్ బాబు డైలాగ్. విలన్లకు సంబందించి మహేష్ బాబు చేప్పే డైలాగ్ ఇది. అయితే అక్కడి సంగతి ఏమో కానీ మన పక్కనున్న పాకిస్థాన్ కు మాత్రం ఇది బాగా సూట్ అవుతుంది. అందుకేపైనున్న డిక్కీ బలిసిన పాకిస్థాన్.. భారత్ మీద తొడగొడుతోంది అనే టైటిల్ ను వాడాల్సి వచ్చింది. అయితే పాకిస్థాన్ కుక్క బుద్ది అందరికి తెలుసు. తప్పు తప్పు కుక్క కాదు నక్క బుద్ది ఉన్న పాకిస్థాన్. తనకు లేనమ్మ తనకలాడినట్లు తన దేశంలో ఉన్న సమస్యలే చాలదన్నట్లు.. మీద నుండి భారత్ ను రెచ్చగొడుతోంది.

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెత అస్సలు పట్టని పాకిస్థాన్ కయ్యానికి కాలుదువ్వుతూనే ఉంది. అయితే భారత్ మీద ఎన్నో రకాలుగా దాడి చేస్తూనే ఉంది. టిట్ ఫర్ ట్యాట్ లాగా భారత్ ఎన్ని సార్లు బుద్ది చెప్పినా కానీ పాకిస్థాన్ వైఖరి మాత్రం మారడం లేదు. కుక్క తోక వంకర లాగా పాక్ బుద్ది సెట్ కావడం లేదు. కన్న తల్లికి అన్నం పెట్టలేదు కానీ సవితి తల్లికి పట్టుచీర కొనిస్తాడన్నాడట అన్నట్లుగా పాకిస్థాన్ దేశ ప్రజల బాగోగులు మరిచి భారత్ పై మాటల తూటాలు పేలుస్తోంది. తాజాగా మరో వివాదాస్పద చేశారు అక్కడి రక్షణమంత్రిగారు. ఎక్కడైనా అణు బాంబులు వేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని, తమ మనుగడ కోసం అణ్వాయుధాలు ప్రయోగించాల్పి వస్తే తప్పకుండాఆ పని చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు. ఆ ఆప్షన్ తమకు ఎల్లప్పుడూ ఉంటుంది అంటూనే ఆ అవసరం రాకూడదని ప్రార్థిస్తున్నామని అన్నారు.

పైగా మీద నుంచి పాకిస్థాన్ లో ఉగ్రవాదాన్ని భారత్ ఎగదోస్తోందని చెప్పడం విశేషం. అయినా పాలు తాగినా పాము విషాన్నే కక్కుతుంది మరి అలాగే పాక్ కూడా అంతే. పక్కలో బల్లెంలాగా.. తయారైనా పాకిస్థాన్ అంటే భారత్ కు ముందు నుండి చిరాకు. అయితే తాజాగా అణ్వాయుధాల గురించి అక్కడ రక్షణ మంత్రి తెలపడం భారత్ కు నవ్వుతెప్పిస్తోంది. పాకిస్థాన్ కంటే ముందు అప్పుడెప్పుడో చిన్నప్పుడే అణ్వాయుధాలను తయారుచేసుకుంది భారత్. కానీ శాంతి పేరుతో గమ్మున కూర్చుంది. అయితే పాకిస్థాన్ ను పొగుడుతూ.. భారత్ ను తిడుతూ అప్పుడప్పుడు కొంత మంది అటు ఇటు కాని వాళ్లు మాట్లాడుతూనే ఉన్నారు. అయినా ఏనుగు ముందు కుక్కల అరుపులు, హనుమంతుడి ముందు కుప్పిగంతులు ఏమాత్రమైనా పని చేస్తాయా..? బుద్ది లేని పాకిస్థాన్ కు కనీస బుద్ది ఇవ్వాలని సగటు భారతీయుడిగా కోరుకుంటున్నా.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paisatan  India  Atom Bomb  Defence Minister  Khwaja Asif  

Other Articles