Africans in Swamy Ra Ra turn villains in real life, sell drugs in Hyderabad

Swamy ra ra movie actors arrested in cyberabad

swamy ra ra movie actors arrested in cyberabad, cameron youth arrested in cheating case, cameron youth, cyberabad police, cheating case, tollywood movie swamy ra ra, tollywood movie, swamy rara, crime in cyberabad, crime in telangana, foreigners cheating case, Alex Rodrigue Eboko, Ndim Abake Mathieu, inspector Riyazuddin, steroids, potency drugs, sleeping pills, growth hormones, botox injections, Africans In Swamy Ra Ra, Africans Swamy Ra Ra Sell Drugs In Hyderabad, Indiamart

Remember the two Negroes in the movie 'Swamy Ra Ra' who purchase the Ganesha idol? Well, they have turned out to be villains in real life too.

నిజజీవితంలోనూ విలన్లే.. కటకటాల్లో స్వామిరారా నటులు

Posted: 07/07/2015 04:51 PM IST
Swamy ra ra movie actors arrested in cyberabad

వారిద్దరు కామెరూన్‌ దేశానికి చెందిన యువకులు. చదువు కోవడానికి హైదరాబాద్‌కు వచ్చారు. వచ్చిన వారు చదువుకున్నామా..? వెళ్లిపోయామా..? అన్నట్లు వ్యవహరించకుండా ఫిల్మ్ నగర్ పరిసరాల్లో తిరిగారు. ఎట్టకేలకు వారిని అదృష్టం వరించింది. 2012లో విడుదలైన తెలుగు సినిమా ‘స్వామిరారా’లో విలన్‌ పాత్రలు పోషించారు. అయితే తమకు పట్టిన అదృష్టాన్ని అలా కోనసాగించుకోకుండా..( వేరే చిత్రాల్లో పాత్రల కోసం ప్రయత్నించకుండా) తమకు అలవాటైన విలాసవంతమైన జీవితాన్ని కొనసాగిద్దామనుకున్నారు. నిజ జీవితంలోనూ విలన్ గా మారాలనుకున్నారు. అందుకే వక్రమార్గం పట్టారు. చివరకు పోలీసులకు అడ్డంగా చిక్కి కటకటాల వెనక్కి వెళ్లారు.

అర్థం కాలేదా..? చిత్రంలో నటించిన ఇద్దరు కామెరూన్ యువకులు.. నిజ జీవితంలోనూ విలన్లుగా మరి నిషిద్దమైన డ్రగ్స్ తో పాటు అరుదైన విదేశీ పక్షలను అమ్ముతామని నమ్మబలికి దేశవ్యాప్తంగా అనేక మందికి టోకరా వేశారు. సినిమాల్లో లాగే మోసం చేయాలని యోచించిన అందుకు అన్ లైన్ ను వేదికగా మలుచుకున్నారు. ఇండియా మర్ట్ అనే సైట్ ద్వారా వీరు ప్రజలకు కుచ్చుటోపి పెట్టారు. అయితే విదేశీ పక్షులు అమ్ముతామని ఆన్‌లైన్‌ ద్వారా ప్రకటనలు ఇస్తూ జనాలనుమోసం చేస్తున్న అలెక్స్‌ రాడ్‌రీగూ ఎబోకో (27), నడిమ్‌ అబాకే మాథ్యు (31)లు సైబరాబాద్‌ కమీషనరేట్ పరిధిలోని శేరిలింగంపల్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి టోపి పెట్టారు.

మే 5న ఒక జత విదేశీ పక్షులు (మాకాస్‌) రూ.1.50 లక్షలకు అమ్మకానికి ఉన్నట్లు మెయిల్‌ వచ్చింది. అదే రోజు నిందితుల నుంచి ఫోన్‌ వచ్చింది. వారు సూచించిన మేరకు పక్షులను డెలివరీ చేయడానికి అడ్వాన్సుగా రూ.50 వేలను నిందితుల అకౌంట్‌లో డిపాజిట్‌ చేశాడు. విమాన చార్జీల పేరుతో మరింత డబ్బు కావాలని నిందితులు డిమాండ్‌ చేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వీరి మోసం బయటపడింది. డిగ్రీ చదవడానికి మూడేళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చిన నిందితులిద్దరూ ‘స్వామిరారా’ చిత్రంలో నటించారు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ఆన్‌లైన్‌ మోసాలకు శ్రీకారం చుట్టారు.

వీరి బారిన పడ్డవారిలో ముగ్గురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబరాబాద్ క్రైం టీమ్ ఇన్స్ పెక్టర్ రియాజిద్దీన్ ఆద్వరంలో నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేసి రూ.40 వేల నగదు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, యాపిల్‌ నోట్‌ ప్యాడ్‌, 7ఫోన్లు, 9 సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు పెద్ద చిట్టానే దొరికింది. వారు పక్షులతో పాటుగా నిషిద్దమైన డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. 32 రకా స్టెరాయిడ్స్, 28 రకాల పోటెన్సీ డగ్రస్, 16 రకాల నిద్రమాత్రలు, 12 రకాల గ్రోత్ హర్మోన్స్, 8 రకాల బోటోక్స్ ఇంజక్షన్లు విక్రయిస్తామని తమ సైట్ లో పేర్కోన్నట్లు పోలీసులు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cameron youth  cyberabad police  Indiamart  Swamy Ra Ra  

Other Articles