సీనియర్ నేత డి.శ్రీనివాస్ గులాబీ పార్టీ వైపు అడుగులు వేయడం నిజామాబాద్ జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపికే. ఆయన వెంట వెళ్లే వాళ్లెందరన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. ఎంతో మంది నాయకులను రాజకీయాలకు పరిచయం చేసిన ట్రాక్ రికార్డ్ డీఎస్ది. శిష్యగణంతో పాటు అనుచరగణం లిస్ట్ పెద్దగానే ఉంది. మరి వాళ్లంతా ఇప్పుడు శీనన్న మాట వింటారా? మీ వెంటే మేమంటారా? అన్నదానిపై డీఎస్ వర్గీయుల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. డీఎస్ వెంట వెళ్లాలా? వద్దా? అని ఆయన అనుచరుల్లో కొందరు డైలామాలో ఉన్నారని సమాచారం. ఎందుకంటే డీఎస్‌నే నమ్ముకుని ఉన్న ఆయన అనుంగు అనుచరులకు సైతం డీఎస్ పార్టీ మారుతున్నారన్న విషయం చివరిదాకా తెలియకపోవటం ఆశ్చర్యం. మొదట్లో డీఎస్ టీఆర్ఎస్లోకి వెళ్తున్నారన్న వార్తలు వచ్చినప్పుడు అనుచరులు ఖండించారు. కానీ ఆయన కారెక్కెయ్యడం ఖాయమైపోవడంతో వాళ్లంతా ఆలోచనలో పడ్డారు. మాటమాత్రమైనా తమకు చెప్పకపోవటంతో వారు కొంత సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు డీఎస్ చేరుకోవడంతో జిల్లా కాంగ్రెస్‌లో వాతావరణం కాస్త మారిందని సమాచారం. పది మంది కార్పొరేటర్లు, ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ముగ్గురు డీఎస్‌తో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. వాళ్లు డీఎస్‌తో వెళ్లడం ఖాయమేనన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు జిల్లా కాంగ్రెస్ సీనియర్లు డీఎస్ వెంట ఎవరూ వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారని సమాచారం. షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి, సురేష్‌రెడ్డి లాంటి నేతలు ఎప్పటికప్పుడు సెకండ్ కేడర్‌తో చర్చలు జరుపుతున్నారట. ఎమ్మెల్సీ ఆకుల లలిత, తాహెర్ బిన్ హందాన్, గడుగు గంగాధర్‌లతో ఎప్పటికప్పుడు ఫోన్లలో మాట్లాడుతున్న సీనియర్ల నేతలు డీఎస్‌తో ఎవరు వెళ్తున్నారు అన్న దానిపై ఆరా తీస్తున్నారట. డీఎస్ అనుచరులకు సైతం ఫోన్లు వెళ్తున్నాయని తెలుస్తోంది. పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని, వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని సంప్రదింపులు జరుపుతున్నారట. మరి కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలంటే డీఎస్ కారెక్కేవరకు ఆగాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more