Greece | crisis | refendum | EU | Vote

Greeces referendum polls are on a knife edge and a close result could be the worst outcome

Greece, crisis, refendum, EU, Vote

Greece's referendum polls are on a knife edge - and a close result could be the worst outcome ATHENS, Greece - the pivotal referendum that will decide this country's future is just two days away, and it's impossible to call. If Greeks vote "Yes" to the snap vote called by Prime Minister Alexis Tsipras just a week ago, they'll be accepting a bailout deal which may not even be on offer from its European creditors any more.

గ్రీస్ ప్రజలు రెఫరెండంపై ఏం చేస్తారో..?

Posted: 07/03/2015 03:35 PM IST
Greeces referendum polls are on a knife edge and a close result could be the worst outcome

ప్రపంచం మొత్తం గ్రీస్ వైపు చూస్తోంది. ఈ ఐదో తేది గ్రీస్ ప్రజలు రెఫరెండం మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? అసలు ఆర్థిక మాంద్యం దెబ్బ నుండి ఎలా తప్పించుకుంటారు.? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నా సమాధానం మాత్రం కాలం చేతిలోనే ఉంది. మొత్తానికి గ్రీస్ యూరోజోన్‌లో ఉంటుందా  లేదా అన్నది అక్కడి ప్రజాభిప్రాయంపై ఆధారపడి ఉంది. అయితే ఇప్పుడు  గ్రీస్‌ ప్రజలు  ఈ విషయంలో డైలమాలో పడినట్టు కనిపిస్తోంది.  యూరో ఆంక్షలకు  ఆంక్షలకు ఓకే చెప్పాలా లేదా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. గ్రీస్‌ ప్రధాని సిప్రాస్‌ పై ఆగ్రహంతో ఉన్నవారు  యూరో గ్రూప్‌కు అనుకూలంగా ఓటేయాలని భావిస్తున్నారు. ఐఎమ్ఎఫ్ కు యూరోపియన్ బ్యాంకులకు అప్పు తీర్చకుండా  యూరప్‌లో తొలి ఎగవేత దారుగా ముద్ర వేయించుకుంది గ్రీస్. దీంతో ఆదేశం  యూరోజోన్  నుంచి తప్పుకునే పరిస్థితులు తలెత్తాయి. జూన్ 30న  యూరోజోన్‌  ప్రతిపాదించిన బెయిల్‌ అవుట్ ప్యాకేజ్‌కు పై తాను ప్రజాభిప్రాయం తీసుకుంటానని చెప్పి చేతులెత్తేసారు గ్రీస్ ప్రధాని.  అటు యూరోజోన్‌ కూడా రిఫరెండం తర్వాతే మరోసారి సమావేశమవుతామని  ప్రకటించింది.

 

Also Read:  గ్రీస్ సంక్షోభం దెబ్బకు ప్రపంచం అబ్బా.

 

గ్రీస్ సంక్షోభం దెబ్బకు ప్రపంచం అబ్బా.
గ్రీస్ సంక్షోభం దెబ్బకు ప్రపంచం అబ్బా.

కాగా యూరోజోన్‌ అందించిన బెయిల్‌ అవుట్ పై ప్రజాభిప్రాయ సేకరణ ఈనెల ఐదున జరగనుంది. గ్రీస్‌ కు మరోసారి ఆర్ధిక సాయం అందించాలంటే  తమ దేశంలో మరిన్ని ఆర్ధిక ఆంక్షలు విధించాల్సి ఉంటుంది గ్రీస్‌. ఇందుకు ప్రధాని సిప్రాస్‌ సుముఖంగా లేరు. అందుకే ఆయన రిఫరెండంకు మొగ్గు చూపారు ఎల్లుండి జరగనున్న ఈ రిఫరెండంలో  ఎక్కువమంది యెస్‌ అంటే యూరోజోన్‌ పెట్టిన ఆంక్షలకు తలొగ్గినట్టే ..లేదంటే  అక్కడ్నుంచి తప్పుకొని మరిన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధాని  మాత్రం  నో అనే ఓటువేయమంటున్నారు యూరోజోన్‌  పెట్టిన ఆంక్షలు మానవీయకోణంలో లేవని అందుకే వాటిని తిరస్కరించాలని అంటున్నారు. ఇదంతా ప్రధాని చేసిన తప్పిదం కావడంవల్ల  ఆయనపై ఆగ్రహంతో ఉన్నవారు యూరోజోన్‌కు అనుకూలంగా ఓటేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏం జరగబోతోందో.. ఎల్లుండి తేలిపోతుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Greece  crisis  refendum  EU  Vote  

Other Articles