BJP MP Hema Malini injured in road accident; one person killed

Hema malini met with road accident admitted to hospital

hema malini, hema malini accident, hema malini news, hema malini road accident, hema malini health, hema malini hospital, hema malini mercedes accident, hema malini news, entertainment news, accident, actress, BJP MP, Bollywood, BreakingNow, car, Dausa, Entertainment, Hema Malini, India, Jaipur, Mishap, Rajasthan, Actress, BJP MP, Mathura, Hema Malini, injured, car accident, Rajasthan, Dausa district, Jaipur.

Hema Malini was on her way from to Jaipur from Agra when her mercedes car rammed into an Alto car near Dausa (Rajasthan).

రోడ్డు ప్రమాదంలో బిజేపి ఎంపీ హెమామాలినికి గాయాలు.. ఒకరు మృతి

Posted: 07/02/2015 10:16 PM IST
Hema malini met with road accident admitted to hospital

అలానటి నటి.. మధుర నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న బిజేపీ ఎంపి హేమా మాలినికి రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. రాజస్థాన్‌లోని దౌసాలో అమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ కు 55 కిలోమీటర్ల దూరంలోఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హేమామాలిని ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అక్కడి పోలీసులు చెబుతున్నారు.. ఈ ఘటనలో హేమామాలినికి స్వల్ప గాయాలు కాగా, ఆమెతో హుటాహుటిన జైపూర్ లోని ఫోర్టిస్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

హేమామాలినికి తలకు బలమైన  గాయాలు తగిలాయని సమాచారం. అమె ప్రయాణిస్తున్న మెర్సిడిస్ బెంజ్ కారు మరో మారుతి అల్టో కారును ఢీ కోనసడంతో ఈ ప్రమాదం సంభవించింది. కాగా ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మరణించిందని వార్తలు అందుతున్నాయి. మరోవైపు అల్టో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వారందిరీనీ కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి వుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress  BJP MP  Mathura  Hema Malini  injured  car accident  Rajasthan  Dausa district  Jaipur.  

Other Articles