Madras High Court rules that second wife has a legal right to pension

Second wife also has legal right to pension says madras hc

madras high court, justice d. hariparanthaman, second wife's right, family pension, justice d hariparanthaman, pension rights to the second wife, Principal Accountant General, legal right to pension, Stanley, head constable in Coimbatore, Suganthi, Stanley married Suseela

Justice D. Hariparanthaman of the Madras High Court has granted pension rights to the second wife of a deceased police official, setting aside the order of the Principal Accountant General (Accounts and Entitlements).

భర్త ఫించనుపై రెండో భార్యకు హక్కులు: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Posted: 07/02/2015 01:56 PM IST
Second wife also has legal right to pension says madras hc

భర్త ఆస్తులు, ఫించనుపై రెండో భార్యకు కూడా హక్కు వుంటుందని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. చట్ట ప్రకారం పెళ్లి చేసుకోకపోయినా సహజీవనం చేసిన మహిళకు భర్త ఫెంచన్ అందుకునే హక్కు వుంటుందని మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. తమిళనాడు లోని కోయంబత్తూర్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ మేరకు తీర్పను వెలువరించింది, హెడ్ కానిస్టేబుల్ ష్టాన్లీ రెండో భార్య సుశీల కేసులో కోర్టు పై విధంగా తీర్పును తెలిపింది.

కేసు వివరాల్లోకి వెళ్తే.. స్టానీ అనే హెచ్ కానిస్టేబుల్ కు 1973లో సుగంథి అనే అమ్మాయితో వివాహమైంది. అనంతరం వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వారిద్దరూ విడిపోయారు. అయితే భార్యకు విడాకులు ఇవ్వకుండానే సుశీల అనే మరో మహిళతో స్టాన్లీ కలసి సహజీవనం సాగించాడు. ఇటీవలే అతను చనిపోవడంతో.. ఆ తరువాత ఆయన మొదటి భార్య కూడా మరణించింది. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ కుటుంబానికి వచ్చే పింఛన్ ను తనకు ఇప్పించాలంటూ సుశీల ఎకౌంటెండ్ జనరల్ కు అప్పీలు చేసుకుంది. అయితే అమె చట్ట ప్రకారం స్టాన్లీ భార్య కాదంటూ ప్రతిపాదనను అకౌంటెంట్ జనరల్ తిరస్కరించారు.

దీంతో న్యాయపోరాటానికి తెరలేపిన సుశీల ఈ విషయమై మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేసింది. తన భర్త, అతని మొదటి భార్య ఇద్దరు మరణించడంతో తనకు అతని ఫించన్ ను అందేలా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టును వేడుకుంది. దీంతో పీటీషన్ ను విచారించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం విచారణ జరిపి సుశీలకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. పెళ్లి చేసుకోకపోయినా, సహజీవనం చేసినా..రెండో భార్యకు కూడా భర్త పించన్ అందుకునే హక్కు వుంటుందని తీర్పు చెప్పింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : family pension  Justice D Hariparanthaman  Madras High Court  Second Wife's Right  

Other Articles