YSRCP | Jagan | Nellore | office

Ysrcp party vacate the dist office in the nellore

YSRCP, Jagan, Nellore, office

YSRCP party vacate the dist office in the nellore. YSRCP nelllore dist office vacated by the lack of funds.

తట్టబుట్టా సర్దుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ

Posted: 07/02/2015 11:15 AM IST
Ysrcp party vacate the dist office in the nellore

టైటిట్ చదవగానే జగన్ కు ఏపిలో మంచి సీట్లే వచ్చాయి కదా మరి ఎందుకు పార్టీని మూసేస్తారు..? అయినా పార్టీ తీసేసిన తర్వాత ఏం చేసుకుంటారు..? ఇలా ప్రశ్నలు వస్తున్నాయేమో కానీ వాటికి పుల్ స్టాప్ పెట్టండి. ఎందుకంటే మొత్తం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కాదు మేం చెబుతున్నది.. కేవలం ఒక జిల్లాకు చెందిన విషాయాన్ని మాత్రమే చెబుతున్నాం. అది కూడా నెల్లూరుకు సంబందించిన వార్త. అయితే తాజాగా నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలోని అన్ని సామాన్లతో సహా ఖాళీ చేయడం వార్తల్లో నిలుస్తోంది. అయితే అసలు విషయం ఏంటంటే పార్టీ కార్యాలయానికి కూడా అద్దె కట్టలేని పరిస్థితి కాబట్టే ఖాళీ చేస్తున్నట్లు వైసీపీ నేతలు వెల్లడించారు. అయితే ఎడారిలో ఇసుక కరువా.. సముద్రంలో నీళ్లు కరువా అన్నట్లు జగన్ పార్టీకి నిధులు కరువా అనే ప్రశ్న వస్తోంది.

తాజాగా నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయం ఖాళీ అయ్యింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయం ఖాళీ చేయడం చర్చనీయాంశమైంది. పార్టీ కార్యాలయ నిర్వహణ ఖర్చును ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ భరిస్తామని మొదట హామీ ఇచ్చినా నిలుబెట్టుకోలేదు. జిల్లా పార్టీ కార్యాలయం నిర్వహిస్తున్న భవనానికి అద్దె రూ.40వేలు, సిబ్బంది, విద్యుత్‌ తదితర ఖర్చులన్నీ కలుపుకుంటే నెలకు రూ.1 లక్ష అవసరం ఉంది. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేటప్పుడే ప్రసన్న తన ఆర్థిక పరిస్థితిని జగన్‌కు వివరించారు. ఆ సర్దుబాటు చేస్తామని జగన్‌ హామీ ఇవ్వడం, కొద్దిరోజులుగా అది కార్యరూపం దాల్చకపోవడంతో అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని కొందరు పార్టీ నేతల దృష్టికి తీసుకుపోగా, ఇంటి యజమాని అవసరం ఉందని ఒత్తిడి చేయడంతో ఖాళీ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తానికి వైసీపీ నెల్లూరు కార్యాలయం ఖాళీ అయ్యింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  Jagan  Nellore  office  

Other Articles