Revanth Reddy | bail | Delay | Charlappai jail | TDP | cash for vote

Revanth reddy release delayed for the technical errors in the bail copies

Revanth Reddy, bail, Delay, Charlappai jail, TDP, cash for vote

Revanth reddy release delayed for the technical errors in the bail copies. HIgh court issue the bail copy as surety has to submitt to ACB Instead of ACB court.

ITEMVIDEOS: రేవంత్ విడుదల ఆలస్యం ఎందుకంటే..

Posted: 07/01/2015 01:08 PM IST
Revanth reddy release delayed for the technical errors in the bail copies

ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డికి హైకోర్ట్ నిన్న బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది. అయితే బహుశా ఈ ఉదయం వరకు రేవంత్ రెడ్డి బెయిల్ మీద బయటకు వస్తారని అందరూ అనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల రేవంత్ రెడ్డి విడుదల కాస్త ఆలస్యమవుతోంది. ప్రింటింగ్ మిస్టేక్ కారణంగా మధ్యాహ్నం తర్వాత రేవంత్ రెడ్డి జైల్ నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే బెయిల్ కాపీపై ప్రింటింగ్ మిస్టేక్స్ పై మరో సారి పిటిషన్ వేసేందుకు రేవంత్ లాయర్లు సిద్దమయ్యారు. పూచీకత్తును ఏసీబీ కోర్టుకు బదులుగా ఏసీబీ సమర్పించాలని బెయిల్ కాపీలలో ఉండటంతో.. రేవంత్ రెడ్డి విడుదల కాస్త ఆలస్యం కానుంది.  అయితే చర్లపల్లి జైలుకు ఇప్పటికే చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు చేరుకున్నారు.

అయితే దీనిపై హైకోర్టు నుండి వెంటనే కొత్త బెయిల్ కాపీని తీసుకువచ్చారు రేవంత్ లాయర్లు. పూచీకత్తును ఏసీబీ కోర్టులోనే సమర్పించాలని, ఏసీబీకి కాదని కొత్త బెయిల్ కాపీని హైకోర్టు ఇష్యూ చేసింది. మొత్తానికి ఇక రేవంత్ రాకకు అన్ని రకాలుగా లైన్ క్లీయర్ అయింది. కోర్టు బెయిల్ కాపీ అందగానే రేవంత్ రెడ్డిని విడుదల చెయ్యడానికి జైల్ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  bail  Delay  Charlappai jail  TDP  cash for vote  

Other Articles