The Krishna District Acide Attack Mystery Revealed | Girl Rani Died | Rajesh injured | Police Investigation

Krishna district acide attack mystery revealed girl rani died rajesh injured

krishna acid attack, krishna dist acid attack, acid attack rani died, acid attack on rajesh, rani and rajesh live in relationship, acid attacks, krishna acid attack incident, krishna acid attack mystery

Krishna District Acide Attack Mystery Revealed Girl Rani Died Rajesh injured : Finally Krishna District Police Revealed the mystery of acide attack in which lover rani died and her boyfriend rajesh injured.

‘యాసిడ్ దాడి’: తన ‘ప్లాన్’కు తనే బలైన ప్రియురాలు

Posted: 06/29/2015 11:09 AM IST
Krishna district acide attack mystery revealed girl rani died rajesh injured

కృష్ణాజిల్లాలో ఇటీవలే సంచలనం సృష్టించిన ‘యాసిడ్ దాడి’ కేసు.. ఎవరూ ఊహించని విధంగా మలుపు తిరిగింది. ఈ కేసును విచారించిన పోలీసులు.. సమగ్ర దర్యాప్తు అనంతరం మిస్టరీని ఛేదించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన ప్రియురాలే నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. తమ ప్రియుడిని హతమార్చేందుకు వేసిన ఈ ప్లాన్ బెడిసికొట్టడంతో ప్రియురాలే బలైందని పోలీసులు తేల్చారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాణి అనే యువతి గతకొన్నాళ్లుగా కఠారి రాజేష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే.. ఇటీవలే అతనికి పెళ్లి నిశ్చయం కాగా.. రాణి తీవ్ర మనస్తాపానికి గురై అతనిపై యాసిడ్ దాడి చేసేందుకు ప్లాన్ చేసేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకుంది. రాణి పన్నిన పథకం ప్రకారమే.. తన ప్రియుడు రాజేష్ ను తీసుకుని ద్విచక్ర వాహనంపై కృష్ణాజిల్లాలోని గన్నవరం మండలం బుడమేరు వంతెన వద్దకు చేరుకుంది. ఆ సమయంలో ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు ఇద్దరు వ్యక్తులు యాసిడ్ చల్లారు.

ఈ ప్రమాదంలో బైకు అదుపుతప్పగా.. రాణి కిందపడి తీవ్ర గాయాలపాలైంది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మరణించింది. ఈ యాసిడ్ దాడిలో రాజేష్ కూడా తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ విధంగా ఆమె తన ప్రియుడిని హతమార్చాలని భావించి, తానే బలైపోయింది. ఈ దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారింగా.. కేసు మిస్టరీ వీడిందని పోలీసులు చెప్పారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : krishna dist acid attack  acid attack incidents  

Other Articles