ప్రభుత్వాలు వేరైనా పాలసీలు మాత్రం ఒక్కటే. తెలంగాణ, ఏపి సిఎంలు ఒకటే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. అదేంటి కేసీఆర్ కు, చంద్రబాబు నాయుడుకు అస్సలు పడదు కదా మరి అలాంటప్పుడు ఒకరిని మరొకరు ఎలా ఫాలో అవుతున్నారు అని అనుకుంటున్నారా..? అధికారంలోకి వచ్చిన తర్వాత అధికరిక పర్యటనలు చెయ్యడానికి వీలుగా అన్ని హంగులతో బస్సులను రెడీ చేసుకోవడం అందులో పర్యటనలు జరపడం మామూలే. అయితే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్డప్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎంత ఖర్చు చేసైనా సరే హైఫైగా ఉండేందుకు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు బాటలోనే కేసీఆర్ కూడా పయనిస్తున్నారు. అత్యాధనిక హంగులతో కూడిన బస్సును ప్రత్యేకంగా తెలంగాణ సిఎం కేసీఆర్ కోసం తయారుచేయిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పర్యటనల కోసం ప్రభుత్వం మెర్సిడెజ్ బెంజ్ బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజానంతో కూడిన ఈ బస్సులో పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేందుకు ఇందులో అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సెంట్రల్ ఏసీతోపాటు పడకగది, బాత్‌రూం, అధికారులతో సమావేశమయ్యేందుకు చిన్న హాల్, బస్సుపైకి ఎక్కి ప్రసంగించేందుకు మెట్లు, బస్సుపై ముఖ్యమంత్రితోపాటు ఇతర నాయకులు, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది నిలుచుండేలా ఏర్పాట్లు చేశారు. సుమారు అరకిలోమీటరు దూరం వరకు లేదా లక్షమంది ప్రజలకు స్పష్టంగా వినిపించేలా మెర్సిడెజ్ సంస్థ ప్రత్యేకమైన మైకులను అమర్చింది. అవసరమైతే ఇందులో మీడియా సమావేశాలు కూడా నిర్వహించుకునే వీలుంది. సెన్సర్లతో కూడిన అగ్నిప్రమాద నివారణ పరికరాలు, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో కూడిన సమాచార వ్యవస్థ, సెక్యూరిటీ అధికారులు ఉండేందుకు క్యాబిన్‌లు, ఎక్కువ సామర్ధ్యం గల బ్యాటరీలు, జనరేటర్ వంటి సదుపాయాలు ఈ బస్సులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చండీగఢ్‌లోని మెర్సిడెజ్ బెంజ్ యూనిట్‌లో ఈ బస్సు తయారైంది. రెండురోజుల క్రితమే ఈ బస్సు తెలంగాణకు బయల్దేరింది. మరో రెండు, మూడురోజుల్లో రాష్ర్టానికి చేరనుంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more