Revenath reddy | Telangana | Assembly | Suspend | TRS, telangana govt

Telugu content

Revenath reddy, Telangana, Assembly, Suspend, TRS, telangana govt

Telangana govt moves to suspend Revanth Reddy from the telangana assembly. TRS party moves to block the tdp party telangana major leader Mr. Revenath Reddy.

రేవంత్ కు మరో షాక్.. అసెంబ్లీ నుండి సస్పెన్షన్ ఖాయం!

Posted: 06/27/2015 08:03 AM IST
Telugu content

రేవంత్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఇప్పటికే కస్టడీని ఎదుర్కొంటున్న రేవంత్ కు మరో షాక్ తగలనుంది. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగితే అప్పుడు ఓటుకు నోటు కేసులో అరెస్టైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు ఖాయమని అధికార టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.  ఈ కేసులో రేవంత్‌ రెడ్డి బెయిల్‌పై విడుదలైనప్పటికీ, ఆయనను అసెంబ్లీలో అడుగు పెట్టనిచ్చేదిలేదని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా బావిస్తున్నట్లుయ తెలుస్తోంది. గతంలో అసెంబ్లీలో జాతీయ గీతాన్ని అవమానించారని తెలంగాణ స్పీకర్ రేవంత్ తో సహా పలువురు తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అయితే తాజాగా మరోసారి రేవంత్ మీద వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని అడ్డుకోవడంలో భాగంగా తెరాస ప్రభుత్వం అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.

ఓటుకు నోటు వ్యవహారం కేసు కోర్టులో నడుస్తుండగా రేవంత్ రెడ్డి మీద అసెంబ్లీలో చర్యలు తీసుకునే వీలుందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అసెంబ్లీలో చర్యలు తీసుకోవడానికి, కోర్టు కేసుకు అసలు సంబంధమే ఉండదని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు పలువురు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. కోర్టులో కేసులు నడుస్తున్న అంశాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరిపి, తీర్మానాలు చేసి, నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. ఈ మేరకు న్యాయ నిపుణులు కూడా టీఆర్‌ఎస్‌కు తమ అభిప్రాయం చెప్పినట్లు పేర్కొంటున్నారు. సభ్యుడి సస్పెన్షన్‌ అనేది పూర్తిగా స్పీకర్‌ పరిధిలోనిదని చెబుతున్నారు. ‘ఎమ్మెల్యేగా ఉంటూ ముడుపుల కేసులో అడ్డంగా దొరికి ప్రజా ప్రాతినిధ్యానికే మచ్చ తెచ్చారు’ అనే కారణంతో రేవంత్‌ రెడ్డిపై సస్పెన్షన్‌ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రతిపాదించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఎన్నాళ్లపాటు సస్పెండ్‌ చేస్తారనేది ప్రభుత్వ పెద్దల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revenath reddy  Telangana  Assembly  Suspend  TRS  telangana govt  

Other Articles