Lalit Modi's new tweet bomb: Met Priyanka, Vadra in London

Lalit modi tweets happy to meet gandhi family in london

Lalit Modi, Gandhi family, Congress, Priyanka Gandhi, Priyanka Gandhi Vadra, Robert Vadra, Vasundhara Raje, IPL, UK immigration, Lalit Modi visa row, BJP, rahul gandhi

Lalit Modi's tweets about "meeting the Gandhi family" in London have been seized by the ruling BJP as it confronts calls for the resignation of Rajasthan Chief Minister Vasundhara Raje for helping the graft-accused cricket boss.

మరో బాంబు పేల్చిన లలిత్ మోడీ.. రాహుల్, ప్రియాంకలను కలిశా..

Posted: 06/26/2015 05:36 PM IST
Lalit modi tweets happy to meet gandhi family in london

ఐపిఎల్ వ్యవస్థాపక చైర్మన్, ఆర్థిక నేరాలు, నిధుల మళ్లింపు కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కోంటున్న లలిత్ మోడీ.. దేశంలో జరుగుతున్న పరిణామాలను, ముఖ్యంగా బిజేపీ నేతల, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రుల చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు నేపథ్యంలో వారిని రక్షించే బాధ్యతను తన భుజాలపైకి ఎత్తుకున్నారు. సామాజిక మాద్యమం ట్విట్టర్ ద్వారా తాను ఎవరెవరిని కలిసింది, ఎక్కడెక్కడ వారితో సమావేశమైంది తదితర విషయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్న లలిత్ మోడీ తాజాగా మరో కిలక విషయం వెల్లడించారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తనయ ప్రియాంకా గాంధీని, ఆమె భర్త రాబర్ట్ వాద్రాను తాను కలుసుకున్నానని లలిత్ మోడీ ట్విట్ చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కూడా తాను భేటీ అయ్యానని తెలిపారు. గత ఏడాది లండన్ లో ఆ ముగ్గురితో సమావేశం అయ్యానని తెలిపిన లలిత్ ఆ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వుందని గుర్త చేశారు. అనాటి సమావేశం గురించి ముగ్గురు వ్యక్తులు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు.

తాను వారితో రెస్టారెంట్ లో కుసుకున్నప్పుడు.. గాంధీ కుటుంబికులతో పాటు టిమ్మి సర్నా ఉన్నాడని, అతడితో వద్ద తన కాంటాక్ట్ నెంబర్ వుందన్నాడని కూడా టిమ్మి సర్నా వారితో చెప్పాడని పేర్కోన్నాడు. అతడికి కాల్ చేస్తే తాను ఏ విధంగా స్పందించానన్నది తెలుస్తుందని రెడో ట్విట్ లో మోడీ పేర్కోన్నాడు. తన విసా పత్రాకలు సాయం చేశారన్న అభియోగాలపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్.. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజేలను రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న తరుణంలో లలిత్ మోడీ ట్విట్ వారిని వెనుకంజ వేసేలా చేస్తుందా..? లేక మరింతగా రెచ్చగొట్టి.. నిరసనలు, ధర్నాలకు దిగేలా ప్రోత్సహిస్తుందా వేచి చూడాల్సిందే.

లలిత్ మోడీ కొత్తగా ట్విట్ చేయడంతో దానిని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్న బిజేపీ.. కళంకితుడు లలిత్ మోడీతో గాంధీ కుటుంబం సన్నిహితంగా ఉండటం పట్ల కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని బిజేపి డిమాండ్ చేసింది. అయితే మోడీతో మాట్లాడడం తప్పేమీ కాదని కాంగ్రెస్ ప్రియాంక గాంధీ, రాబర్డ్ వాద్రాలను ఢిఫెన్స్ చేసే పనిలో పడింది. ఈ విషయమై కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్ రణ్ దీఫ్ సూర్జీవాల మాట్లాడుతూ.. ప్రియాంక గానీ, ఆమె భర్త గాని లలిత్ మోడీతో ఎప్పడూ ప్రత్యేకంగా మాట్లాడలేదని, ఓ రెస్టారెంటులో ఎవరైనా కలసినప్పుడు మాట్లాడడం నేరమేమీ కాదని స్పష్టం చేశారు.

అక్కడితో ఆగని కాంగ్రెస్ బిజేపీపై మరిన్నీ అస్త్రాలను సంధించింది. అసలు లలిత్ మోడీ బిజేపి అదేశానుసారం పనిచేస్తున్నాడ సందేహాన్ని వ్యక్తం చేసింది. సుష్మా స్వరాజ్, వసుందరా రాజేల రాజీనామాను డిమాండ్ చేస్తున్న విఫక్షాలను తప్పదోవ పట్టించడానికే లలిత్ మోడీ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. సుష్మ స్వరాజ్, వసుందర రాజేలపై వస్తున్న ఆరోపణలపై కేంద్రం ప్రజలకు సమాధానం ఇవ్వాలని సూర్జీవాల డిమాండ్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl fixing  lalit modi  UPA  rahul gandhi  twitter  priyanka gandhi  robert vadra  london  

Other Articles