election commission | cash for vote | Revanth Reddy | Foresnsic lab

Election commission filed a petetion to give the report of cash for vote case audio tapes

election commission, cash for vote, Revanth Reddy, Foresnsic lab, acb, Telangana, court, Bhanwarlal

Election commission filed a petetion to give the report of cash for vote case audio tapes. Forensic science lab test the Revanth Reddy conversation with stephenson.

ఓటుకు నోటు కేసులోకి ఎలక్షన్ కమీషన్

Posted: 06/26/2015 07:58 AM IST
Election commission filed a petetion to give the report of cash for vote case audio tapes

ఓటుకు నోటు కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటిదాకా మౌనం పాటించిన ఎన్నికల కమిషన్‌ రంగ ప్రవేశం చేసింది. ఎసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబోరేటరీ ఇచ్చిన ఆడియో, వీడియో టేపులను, నివేదికను తమకు కూడా అందజేయాలని ఎన్నికల కమిషన్‌ ఏసీబీ ప్రత్యేక కోర్టుస్థానాన్ని కొరడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్లయ్యింది. దీన్ని బట్టి చూస్తుంటే నేరుగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఓటుకు నోటు వ్యవహారాన్ని తామే దర్యాప్తు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌తో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి జరిపిన బేరసారాలకు సంబంధించిన వీడియో టేపులను, ఆడియోలను తమకు కూడా ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందుతూనే ఉందని, ఈ వ్యవహారంలో ఆధారాల కోసం జూన్‌ 1న ఎన్నికల కమిషన్‌ తరపున పిటిషన్‌ను దాఖలు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ చెప్పారు. తాజాగా రిమైండర్‌ వేశామన్నారు. ఈ కేసులో ఎప్పటికప్పుడు తనకు అందుతున్న సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి చేరవేస్తూనే ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

ఏసీబీ కోర్టులో ఉన్న ఈ కేసు తుది తీర్పు వచ్చాకే ఏం చేయాలో భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని భన్వర్ లాల్ ప్రకటించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఎన్నికల కోసం తరలించే డబ్బును పట్టుకునే అధికారం కేవలం ఎన్నికల కమీషన్‌కే ఉందని ఒకవేళ పోలీసులు వాహనాలను లేదా నాయకుల నివాసాలపై దాడి చేసి అక్రమంగా దాచి ఉన్న డబ్బును పట్టుకున్నట్లైతే ఆ మొత్తాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి లేదా ఎన్నికల సంఘానికి అప్పగించవలసి ఉంటుందని అయితే ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి వ్యవహారాన్ని అవినీతి నిరోధక శాఖ వలపన్ని ఎలా పట్టుకుంటుందని ఏసీబీని ఏర్పాటు చేసింది అవినీతి, లంచగొండి అధికారులను, సిబ్భందిని పట్టుకోవాలే తప్ప రాజకీయ నేతలతో వారికి ఎటువంటి సంబంధం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.  ఈ నేపధ్యంలో ఈ కేసును ఎన్నికల సంఘం స్వీకరించి తద్వారా మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఓటుకు నోటు కేసులో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : election commission  cash for vote  Revanth Reddy  Foresnsic lab  acb  Telangana  court  Bhanwarlal  

Other Articles