Rangareddy district court orders to lb Nagar police to case file on chandrababu Naidu | Vote for note

Rangareddy district court orders police to case file on chandrababu

rangareddy court, chandrababu naidu, lawyer bhargav, vote for cash, cash for note in ap, chandrababu naidu controversy, kcr news, kcr party, kcr controversy, governor narasimhan, governor narasimhan latest news, kcr latest updates

Rangareddy district court orders police to case file on chandrababu : Rangareddy District Court orders to LB nagar police to filed a case on AP cm chandrababu naidu for abuse comments on governor and telangana state.

బాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు

Posted: 06/25/2015 06:05 PM IST
Rangareddy district court orders police to case file on chandrababu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలతో సతమతమవుతున్న ఆయనపై కేసు నమోదు చేయాలని తాజాగా రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ‘ఓటుకు నోటు’ విషయంలో బాబు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని విచారించిన కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్లగా.. ‘ఓటుకు నోటు’, ‘ఫోన్ ట్యాపింగ్’ వంటి వ్యవహారాలను తెలంగాణ ప్రభుత్వం తెరమీదకి తెచ్చిన అనంతరం బాబు కొన్నాళ్లపాటు ఆందోళనల్లో మునిగిపోయారు. ఆ తర్వాత ఆయన పుంజుకుని.. తన మాటల తూటాలతో తెలంగాణ రాష్ట్రంపై, టీఆర్ఎస్ పార్టీపై ముఖ్యంగా కేసీఆర్ ని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొన్ని సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు కూడా చేసినట్లు సమాచారం. ఇలా ఈ విధంగా ఆయన ఆవేశంగా మాట్లాడటమే ఆయన్ను మరింత ఇరకాటంలో పడేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే భార్గవ్ అనే న్యాయవాది రంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో బాబుపై ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేవారు. ‘ఓటుకు నోటు’ కేసు విషయంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్రంపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం.. చంద్రబాబుపై కేసు నమదు చేయాలంటూ హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీసులకు ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rangareddy district court  chandrababu naidu  cash for vote  lawyer bhargav  

Other Articles