Mathayya, Cash for vote, Revanth Reddy, Telangana, Guntur

Jerusalem mathayya clear that he is in his auntys home

Mathayya, Cash for vote, Revanth Reddy, Telangana, Guntur

Jerusalem Mathayya clear that he is in his auntys home. In the Cash for vote case Mathayya is the accused. The Telangana police searching for Mathayya.

అత్తారింట్లో ఓటుకు నోటు కేసు నిందితుడు మత్తయ్య

Posted: 06/23/2015 03:14 PM IST
Jerusalem mathayya clear that he is in his auntys home

మత్తయ్య.. ఓటుకు వ్యవహారంలో నాలుగో నిందితుడిగా, కేసీఆర్ మీద కేసు పెట్టిన వ్యక్తిగా జెరూసలెం మత్తయ్య వార్తల్లో నిలిచారు. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ పోలీసులు మత్తయ్య కోసం గాలింపులు చర్యలు చేపట్టినా ఎలాంటి లాభం లేకుండాపోయింది. ఇప్పటి వరకు కూడా మత్తయ్యను పోలీసులు పట్టుకోలేకపోయారు. నిజానికి మత్తయ్యను పట్టుకోవడానికి పోలీసులు గట్టిగా ప్రయత్నించలేదని పుకారు వినిపిస్తోంది. అయితే తెలంగాణలో కనిపించడని మత్తయ్య ఉన్నట్లుండి సీమాంధ్రలో కనిపించారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో కేసీఆర్ మీద, తనకు ప్రాణహాని ఉందని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఏపి ప్రభుత్వం మత్తయ్య ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఓటుకు నోటు కేసుతో తెలంగాణ సర్కార్ దూకుడు పెంచితే ఏపి ప్రభుత్వం మత్తయ్య ఫిర్యాదుతో దూకుడుకు సిద్దమైంది.

అయితే తెలంగాణ పోలీసులకు కనిపించకుండా తిరిగుతున్న మత్తయ్య ఎక్కడా అని ఆరా తీస్తే మాత్రం వివరాలు లేవు. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో మత్తయ్యను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఫలించడం లేదు. అయితే నేను ఇక్కడున్నానండీ బాబూ అంటూ మత్తయ్య తను ఉంటున్న అడ్రస్ పై వివరణ ఇచ్చుకున్నారు. తాను ఏపి మంత్రుల సంరక్షలో ఉన్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. తన బార్య స్వస్థలం గుంటూరులోని అత్తగారింట్లో ఉంటున్నానని జెరూసలేం మత్తయ్య స్పష్టం చేశారు. మొత్తానికి తాను తన అత్తగారింట్లో ఉన్నానని తెలిపారు మత్తయ్య.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mathayya  Cash for vote  Revanth Reddy  Telangana  Guntur  

Other Articles