Swiss Banks | Black Money | Money landering

Swiss banks agree that the banks were the heavens to the black money

Swiss banks, Switzerland, Black money, money landering

Swiss banks agree that the banks were the heavens to the black money. Swiss banks having one by fourth black money in there banks.

నల్లధన స్వర్గధామాలు.. స్విస్ బ్యాంకులు

Posted: 06/22/2015 04:45 PM IST
Swiss banks agree that the banks were the heavens to the black money

స్విట్జర్లాండ్ అందాలకే కాదు అవినీతి సొమ్ముకు కూడా చాలా ఫేమస్. అయితే ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా దాదాపుగా అక్రమార్కులు అందరు కలిసి దాచుకునే స్విస్ బ్యాంకుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్విస్ ఖాతాదారులకు సంబందించి ఏ దేశానికి లేనంతగా సీక్రెట్ గా మెంటైన్ చెయ్యడమే స్విస్ బ్యాంకుల ప్రత్యేకత. అయితే ప్రపంచ దేశాల్లోని ఏ దేశం అడిగినా స్విస్ బ్యాంకులు తమ ఖాతాదారుల వివరాలను ఇవ్వవు. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా ఖాతాదారులకు ముందుగా ఇన్ ఫాం చేసి తర్వాత వారి పేర్లను ఆయా దేశాలకు పంపిస్తారు. అయితే మనీలాండరింగ్ ద్వారా వస్తున్న మనీలో దాదాపు అరవై శాతానికి పైగ సొమ్ము ఒక్క స్విస్ ఖాతాల్లోకే చేరుతుందని అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా స్విస్ బ్యాంకు కొన్ని సవరణలు తీసుకువచ్చింది. తమ ఖాతాదారులకు సంబందించిన వివరాలను కొన్ని కండీషన్స్ మీద తెలిపేందుకు సిద్దమైంది. అయితే ప్రపంచం మొత్తం బ్లాక్ మనీకి అడ్డాగా మారిన స్విస్ బ్యాంకులు మాత్రం తమ తప్పును ఒప్పుకోవడం లేదు.

అయితే తాజాగా నల్లధనం దాచుకునేందుకు స్వర్గధామ దేశంగా స్విట్జర్లాండ్ పేరుగాంచిందని స్విస్ అధికారికంగా ఒప్పుకుంది. మనీలాండరింగ్ ద్వారా విదేశాల్లో ఆస్తులను పోగేయాలనుకునేవారికి తమ దేశం అత్యంత ఆకర్షణీయ ప్రాంతంగా మారిందని పేర్కొంది. స్విటర్జాండ్‌లోని బ్యాంకులు పెద్ద ఎత్తున ఆర్థిక నేరాల సమస్యను ఎదుర్కొంటున్నాయని స్విస్ ప్రభుత్వ ఉన్నతస్థాయి మండలి అధికారికంగా ఒప్పుకుంది.మనీలాండరింగ్, తీవ్రవాద కార్యకలాపాల కోసం ఫైనాన్సింగ్ వంటి సమస్యలపై పోరాడేందుకు వ్యవస్థను మరింత పటిష్ఠపర్చాల్సిన అవసరం ఉందని మండలి అభిప్రాయపడింది. నల్లధనం సమస్యపై పోరాటాన్ని ముమ్మరం చేసిన భారత్‌తోపాటు ప్రపంచ దేశాలన్నీ స్విట్జర్లాండ్‌పై ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో స్విస్ తాజా స్టేట్‌మెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swiss banks  Switzerland  Black money  money landering  

Other Articles