chaina, dog meat, yulin festival 2015, stop yulinfestival

Social media declare war aganist to the china dog meat festival

chaina, dog meat, yulin festival 2015, stop yulinfestival

Social media declare war aganist to the China Dog meat festival. In china every year conducting the dog meat festival. But this time social media fighting on this festival

ITEMVIDEOS: అయ్యా కుక్కలను చంపొద్దు.. తినొద్దు

Posted: 06/22/2015 01:17 PM IST
Social media declare war aganist to the china dog meat festival

ఫుడ్ ఫెస్టివల్ అనగానే అందరికి నోరూరుతుంది. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా వెళదాం అన్నట్లు ఉంటుంది. ఎందకంటే అన్ని రకాల ఫుడ్స్ ఒకే దగ్గర దొరుకుతాయి కాబట్టి. అయితే చైనాలో ఓ ఫుడ్ ఫెస్టివల్ గురించి మాత్రం సోషల్ మీడియాలో యుద్దమే జరుగుతోంది. అవును ఏంటీ ఆ ఫెస్టివల్ అనుకుంటున్నారా..? డాగ్ మీట్ ఫెస్టివల్. కుక్క మాంసం పేరుతో నిర్వహించే ఫెస్టివల్ అని అర్థం. అయితే ఈ ఫెస్టివల్ కోపమని ఏకంగా చైనాలో పది వేల కుక్కలను చంపి తినేస్తున్నారట. అందుకే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ పారి డాగ్ మీట్ ఫెస్టివల్ పై వ్యతిరేకత వస్తోంది. అయితే కుక్కల మాంసం తినడంపై అక్కడ పెద్దగా వ్యతిరేకత లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం దీనిపై విపరీతమైన వ్యతిరేకత వస్తోంది.

జంతువుల పేర్లతో వివిధ రకాల ఫెస్టివల్స్‌ను నిర్వహించడం చైనాలో సర్వ సాధారణం.డాగ్ మీట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తారు.చైనాలోని గుయాంగ్జి ప్రావిన్స్‌లో ప్రతి యేటా పండగలా  నిర్వహిస్తారు. అయితే సోషల్ మీడియా అవేర్‌నెస్ పెరగడంతో డాగ్‌ మీట్ ఫెస్టివల్ వివాదాస్పదంగా మారింది. వేలాది శునకాలను చంపి ఉత్సవాలు నిర్వహించడాన్ని జంతు ప్రేమికులు తీవ్రంగావ్యతిరేకిస్తున్నారు. జంతువులను ఇష్టారాజ్యాంగా చంపుకొని తినే సంస్కృతిపై ఇటీవల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చైనా సోషల్‌మీడియా సైట్ వైబోలో 'స్టాప్ యులిన్2015' పేరుతో హాష్‌ట్యాగ్ పెట్టి జంతు ప్రేమికులు నిరసన వ్యక్తంచేస్తున్నారు.దీనికి వేలాది ట్వీట్లు, కామెంట్లు వస్తున్నాయి.కొందరు తమ పెంపుడు శునకాలతో ఫొటోలు పెట్టి జంతువులను ప్రేమించమని చెప్తున్నారు..డాగ్‌ మీట్ ఫెస్టివల్‌ వ్యతిరేక ఉద్యమం ఇతర దేశాలకూ పాకింది.ప్రతి ఏడాది ఎక్కువగా చైనాలోని జంతుప్రేమికులే వ్యతిరేకించేవారు.ఈ సారి యులిన్2015 ఫెస్టివల్ ప్రపంచవ్యాప్తంగా నిరసన ఎదుర్కొంటోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chaina  dog meat  yulin festival 2015  stop yulinfestival  

Other Articles