Ap, Tapping, Service providers, notices, Telangana

Ap govt issues notices to the service providers

Ap, Tapping, Service providers, notices, Telangana

Ap govt issues notices to the service providers. ap govt moving fastly on the tapping case. Today SIT isses the notices.

ట్యాపింగ్ పై దూకుడు.. సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు

Posted: 06/22/2015 11:48 AM IST
Ap govt issues notices to the service providers

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్ర బిందువైన ఓటుకు నోటు వ్యవహారం కొత్త కోణాలను వెలికి తీసుకువచ్చింది. ఏపి ముఖ్య అధికారులు, నేతల, ఆఖరుకు చంద్రబాబు నాయుడు ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్లు ఏపి సర్కార్ భావిస్తోంది. అందుకు సంబందించిన ఆధారాలను కూడా ఏపి ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడుకు నోటీసులు అందుతాయన్న వార్తతో ఏపి సర్కార్ స్పీడ్ పెంచింది. వినతు ల వరకు పరిమితమైన ఏపి సర్కార్ తనే స్వయంగా ట్యాపింగ్ పై నిగ్గు తేల్చాలని రంగంలోకి దిగింది. అయితే తాజాగా ట్యాపింగ్ పై తెలంగాణ ప్రభుత్వానికి ఎలా సమాచారం అందుతోందన్న కోణంలో దర్యాప్తును వేగవంతం చేసింది.

తాజాగా ఏపి ప్రభుత్వం 12 సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. ట్యాపింగ్ వ్యవహారం మీద తమకు గతంలో ఏమైనా లేఖలు అందాయా..? లేదా ఎవరైనా అధికారుల నుండి ఆదేశాలు అందాయా..? ఇఃలేదా ఇంకెవరైనా బడా నేతలు ట్యాపింగ్ కు వత్తిడి చేశారా..? అన్న కోణంలో ఏఫి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా సిట్ ముందుకు సర్వీస్ ప్రొవైడర్లు హాజరయ్యారు. అయితే ట్యాపింగ్ పై వాళ్లు తెలిపే వివరాలను బట్టి ఏపి ప్రభుత్వం వేగంగా కదలాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అవసరమైతే కేసీఆర్ కు ఇందులో హస్తం ఉందని తేలితే నోటీసులు కూడా జారీ చేసేందుకు ఏపి సర్కార్ సన్నద్దమైంది. మరి సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే సమాచారంపై తెలంగాణ సర్కార్ ట్యాపింగ్ వ్యవహారం లెక్క తేలిపోతుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  Tapping  Service providers  notices  Telangana  

Other Articles