అనగనగా ఓ ముద్దుగుమ్మ..! మత్తును రంగరించి పాడిన పాటల్ని వదులుతూ జనంలో భలే పాపులర్ అయిపోయింది. అయితే మనసులోంచి ఓ కోరిక గుర్రమై తన్నుకొస్తే తట్టుకోలేక బయటపెట్టేసింది. ఏకంగా ఓ పాపులర్ ఫిగర్‌ని రొంపిలోకి లాగింది.అక్కడి వరకైతే ఓకే కానీ...ఇప్పుడు ఆమె కోరిక అమెరికా అధ్యక్షుడిపై కన్నేసింది.ఒబామాతో రిలేషన్ కోరుకుంటోంది ఈ లేడీ సింగర్.అధ్యక్షుడితో ఓ ఫోటో దిగాలనో... కాసోపు మాట్లాడాలనో లాంటి చిన్నచిన్న కోరికలైతే...ఒకే... అర్ధంచేసుకోవచ్చు.... కానీ అజెలియా మనసులో అంతకు మించిన ఆలోచనే ఉంది. ఏకంగా అమెరికా అధ్యక్షుడితో శృంగారం చేయాలనుకుంటుంది.
ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అజెలియా... ఒబామా అందానికి ఫిదా అయిపోయానంటూ వర్ణించడం మొదలుపెట్టింది. ఒబామా లాంటి అందగాడు ఇంకెవరైనా దొరుకుతాడా అంటూ ఓరేంజ్‌లో యవ్వారం వొలకపోసింది.ఇప్పుడు అమెరికా మొత్తం ఈ భామగారి విపరీతమైన కోరిక గురించే మాట్లాడుకుంటున్నారు. కొందరు గుసగుసలాడుకుంటుంటే.. మరికొందరు నీకేం మెంటలా అంటూ చురకలు అంటిస్తున్నారు. ఆనోటా ఈనోటా అజెలియా కామెంట్స్ అమెరికా మొత్తం వ్యాపించాయ్. దీంతో భామగారు మాటమార్చేసింది. అబ్బెబ్బే అదే లేదు... జస్ట్ జోక్‌గా అన్నానంటూ ట్విస్ట్ ఇచ్చింది. అయితే బరాక్ ఒబామా భారయ మిషెల్ ఒబామాకు విషయం తెలిస్తే మాత్రం ఈ భామ సీన్ సితారే అంటూ కొంత మంది పంచ్ లు కూడా వేస్తున్నారు. మరి ఒబామాగారు ఈ వార్త విన్నారో లేదో..
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more