AP SIT probes deeply into phone tapping issue

Ap government issues notices to telecom operators

phone tapping row, ap sit, notices, telecom operators, note for vote, governer, chandrababu, KCR, High Court Judge, RGV, muthaiah jerusalem, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

Andhra pradesh appointed special investigation Team probing deeply into the row of phone tapping row, issues notices to 12 telecomoperators.

ఫోన్ ట్యాపింగ్ అంశమై దర్యాప్తును మమ్మరం చేసిన సిట్

Posted: 06/21/2015 03:52 PM IST
Ap government issues notices to telecom operators

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం లోతు తేల్చే దిశగా ఏపీ సర్కారు మరో అడుగు వేసింది. ట్యాపింగ్‌కు సంబంధించి ఏపీలో నమోదైన కేసులపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) హైదరాబాద్‌లోని టెలికం ఆపరేటర్లకు నోటీసులు జారీ చేసింది. ‘సోమవారం విజయవాడలోని భవానీపురం పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు రండి’ అని ఆదేశించింది. నోటీసులో కొన్ని సూటి ప్రశ్నలు సంధించింది. ట్యాపింగ్‌ జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్న 120 నంబర్లకుతోడు... మరో 27 నంబర్లతో కూడిన జాబితాను సర్వీస్‌ ప్రొవైడర్లకు అందించారు.

‘‘ఏ ప్రభుత్వ అధికారి, ఏ కేసుకు సంబంధించి ఏ ఫోన్‌ నంబర్‌ను ట్యాప్‌ చేయాలని అడిగారు? అందులో మేం ఇచ్చిన జాబితాలోని నెంబర్లు ఉన్నాయా? ఉంటే... ఆ నెంబర్లను ట్యాప్‌ చేయాలని కోరిన అధికారి ఎవరు? లిఖితపూర్వకంగా కోరారా? లేక... మౌఖింగానే ఆదేశించారా?’’ అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. ఆయా నెంబర్లకు సంబంధించిన ‘లాగ్స్‌’ (సంభాషణల రికార్డులు) మొత్తం ఇవ్వాలని ఆదేశించారు. ఈ వివరాలతో, ప్రశ్నలకు సమాధానాలతో సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని సూచించారు.

అయితే తాము రెండు వారాల డేటా మాత్రమే ఇవ్వగలమని కొందరు... 90 రోజుల సమాచారం ఇవ్వగలమని మరికొందరు ప్రొవైడర్లు చెప్పినట్లు తెలిసింది. ఈ నోటీసులు జారీ చేసిన అనంతరం... ఏపీ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సిట్‌ చీఫ్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ ఆధ్వర్యంలో ఎస్పీ శ్రీనివాస్‌, అడిషనల్‌ ఎస్పీ దామోదర్‌, డీఎస్పీలు నరసింహరావు, గిరిధర్‌, సీఐలు కాశీనాథ్‌, అప్పలనాయుడు, ప్రసాద్‌ ఈ అంశంపై సమీక్షించారు. ఈ నోటీసులకు సర్వీస్‌ ప్రొవైడర్లు సమాధానం ఇచ్చే వరకూ వేచి చూడకుండా... తమంతట తాము సమాచారం సేకరించాలని నిర్ణయించుకున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : phone tapping row  ap sit  notices  telecom operators  

Other Articles