Heavy Rains, Rains, Mumbai, Rains in Mumbai, Mumbai news

Heavy rains getting more problems to mumbai people

Heavy Rains, Rains, Mumbai, Rains in Mumbai, Mumbai news

Heavy Rains getting more problems to Mumbai people. If Mumbai lies prostrate today under knee-deep water unable to move its people towards work or home, it is because the city fathers are simply unable to handle the occasional excess downpour sent down by the rain gods.

నీళ్లల్లో ముంబై.. కష్టాల్లో జనం

Posted: 06/20/2015 01:56 PM IST
Heavy rains getting more problems to mumbai people

ఎప్పుడూ రోడ్ల మీద చీమల్లా కనిపించే ముంబైలో ఇప్పుడు చినుకు చినుకు కురిసి వానై వరదై ముంబైని ముంచెత్తింది. తాజాగా ముంబైలో కురుస్తున్న వర్షాలకు ముంబై మొత్తం అతలలాకుతలం అవుతోంది. ముంబై అంటే దేశానికి ఆయువు పట్టులాంటింది. మహారాష్ట్ర వాసులకే కాదు.. దేశ వ్యాప్తంగా లక్షలాది ప్రజలు ముంబైలో జీవనం సాగిస్తున్నారు. కొన్ని గంటల పాటు వర్షం కురిసిందంటే వీరి జీవనం మొత్తం అస్తవ్యస్తమవుతుంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు ఏకధాటిగా వాన కురవడంతో ముంబై వాసులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. ఒకే ఒక్క రోజు 280 మిల్లీ మీటర్ల వర్ష పాతం కురవడం దశాబ్దకాలంలో ముంబై చరిత్రలోనే లేదు. ముంబై కార్పొరేషన్ లెక్కల ప్రకారం సంవత్సర వర్షపాతంలో పది శాతం ఒకే రోజు కురిసింది. సీజన్ ప్రాంతంలోనే ఈ స్థాయిలో వర్షం కురిసే సరికి ముంబై వణికిపోయింది. మురికివాడలు లోతట్టు ప్రాంతాలే కాదు బడాబాబులు, హై క్లాస్ పీపుల్‌ నివసించే ఏరియాలోనూ ఇదే పరిస్థితి. భారీ వర్షం కురిసిందంటే చాలు ఇలా జలదిగ్బంధంలో చిక్కుకోవాల్సిందే.

01
02
03
04
05
06
07
08

భారీ వర్షం కారణంగా హైకోర్టు ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరడంతో హైకోర్టుకు సెలవులు ప్రకటించారు. వర్షాల కారణంగా హైకోర్టుకు సెలవులు ప్రకటించడం బహుశా మహారాష్ట్రలోనే చూస్తామనుకుంటాం. ఎడతెరిపిలేని వర్షాలకు విద్యుత్ స్తంభాలు విరిగి పడటంతో విద్యుత్ సబ్ స్టేషన్లను కూడా మూసేయాల్సిన దుస్థితి ముంబై మహానగరానిది. వర్షపు నీటిని పంప్ చేయడానికి ఏర్పాటు చేసిన రెండు పంపింగ్ స్టేషన్లు అవసరమైన సమయంలో పనిచేయకుండా పోయాయి. 228 కోట్లతో  సెకనుకు 6వేల లీటర్ల నీటిని తోడివేసే సామర్థ్యంతో వాటిని ఏర్పాటు చేశారు. అయితే ఈ వర్షాలకే అవి పనిచేయకుండా పోయాయి. గంటల కొద్దీ కురుస్తున్న వర్షపు నీరు ఎక్కడిదక్కడే నిలిచిపోవడంతో  సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై చిరువ్యాపారాలు చేసుకునే వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ముంబై రవాణాలో ప్రధానమైనది లోకల్ ట్రైన్ వ్యవస్థ. ప్రతి రోజూ 80 లక్షల మంది వరకూ లోకల్ ట్రైన్స్‌లో జర్నీ చేస్తూ ఉంటారు. భారీ వర్షాలకు ట్రైన్ సర్వీసులు ఆగిపోవడంతో లక్షలాది మంది ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా ప్రాంతాల్లో  రైల్వే స్టేషన్లు నీటిలో మునిగిపోయాయి. దీంతో దాదాపుగా అన్ని సర్వీసులను నిలిపివేశారు. ఇవాళ కూడా భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

 

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Heavy Rains  Rains  Mumbai  Rains in Mumbai  Mumbai news  

Other Articles