The worlds longest bottomed glass bridge in china | worlds strange builts

The worlds longest bottomed glass bridge in china

longest glass bridge, glass bridge, china glass bridge, china latest updates, china latest news, china new builts, china glass brige news, america

The worlds longest bottomed glass bridge in china : Stretching 380m across a section of Zhangjiajie’s Grand Canyon, the new pedestrian bridge will have a completely glass floor. Visitors who dare venture forth can see the full 300m drop to the canyon’s bottom below.

అమెరికాకు పోటీగా చైనా నిర్మిస్తున్న ‘గాజువంతెన’

Posted: 06/19/2015 04:51 PM IST
The worlds longest bottomed glass bridge in china

ప్రపంచంలో ఏదైనా సరికొత్త అద్భుతాన్ని సృష్టించాలంటే అది చైనాకే సాధ్యం! అగ్రరాజ్యాలకు పోటీగా వింతైన నిర్మాణాలు చేపట్టడం దానికదే సాటి! ఇప్పుడు కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ఓ సరికొత్త నిర్మాణాన్ని చైనా చేపట్టింది. అగ్రరాజ్యం అమెరికాతో పోటీ పడుతున్న చైనా.. అన్ని విషయాల్లోనూ పైచేయి సాధించేందుకు ఈ సరికొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. ఇంతకీ చైనా చేపట్టిన ఆ అద్భుతమైన నిర్మాణం ఏంటని ఆలోచిస్తున్నారా..? ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

తాజాగా ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెనను నిర్మించే పనిలో చైనా పూర్తిగా నిమగ్నమై వుంది. జింయాంగ్జియాజ్ అనే ప్రాంతంలో వున్న గ్రాండ్ కాన్యన్ లో 380 మీటర్ల పొడవైన గాజు వంతెనను నిర్మిస్తున్నారు. ఈ గాజు వంతెన పై నుంచి దాదాపు 300 మీటర్ల లోతున వున్న ప్రదేశాన్ని వీక్షించవచ్చు. వచ్చే అక్టోబర్ నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తికానుందని చైనా ప్రభుత్వం వెల్లడించింది. ఈ వంతెనపై ఒకేసారి 800 మంది వెళ్లేంత దృఢంగా నిర్మించారని.. దానిపై నిస్సందేహంగా వెళ్లవచ్చునని అధికారులు వెల్లడిస్తున్నారు.

కాగా.. ఇప్పటికే తియాన్మెన్ పర్వతం వద్ద ఓ గాజు వంతెన వుంది. అయితే.. దానికంటే విశిష్టమైనదిగా నిర్మించాలనే ఉద్దేశంతో అతి పొడవైన వంతెన నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఈ వంతెన ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన అవుతుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : longest glass bridge  america news  

Other Articles