Chandrababu | Slept | Bus | Guest house | camp office

Ap cm chandrababu naidu slept in bus at viajayawada

Chandrababu, Slept, BUs, Guest house, camp office

Ap cm chandrababu naidu slept in bus at Viajayawada. Chandrababu naidu went to Viajayawada on Gaodavari pushkaralu.

బాబుకు వాస్తు దెబ్బ.. బస్సులోనే బస

Posted: 06/19/2015 01:01 PM IST
Ap cm chandrababu naidu slept in bus at viajayawada

నారా చంద్రబాబు నాయుడుకు అసలే టైం బాగోలేదు అందుకే వాస్తు, శాంతి పూజల మీద బాగా నమ్మకం పెంచుకున్నారు. అయితే తాజాగా అమరావతి పూజ తర్వాత శాంతి పూజలు చెయ్యనందుకే చంద్రబాబు టైం బాగోలేదని కొంత మంది వాదిస్తున్నారు. దాంతో శాంతి పూజలు చేయించే పనిలో పడ్డారు చంద్రబాబు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల మీద పరిశీలకు వెళ్లిన ఆయన మరోసారి వాస్తు సెంటిమెంట్ ను ఫాలోఅయ్యారు. వాస్తు బాగులేని గెస్ట్ హౌజ్ కు వెళ్లవద్దని చంద్రబాబు ఆధ్యాత్మిక విషయాలను చూసే పండితులు చెప్పడంతో పాపం.. బస్సులోనే నిద్రపోయారు చంద్రం. అయితే చంద్రబాబు నాయుడు వాడే బస్సు సకల సదుపాయలు కలిగి ఉందని అందరికి తెలుసు.

చంద్రబాబునాయుడు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించారు. పుష్కరాల పనుల్ని, పట్టిసీమ ప్రాజెక్టు పనుల్ని సమీక్షించారు. తూర్పుగోదావరి నుంచి చంద్రబాబు నేరుగా... విజయవాడకు రాత్రి చేరుకున్నారు. నేరుగా గవర్నరుపేటలో తాత్కాలికంగా సిద్ధం చేస్తున్న ఏపీ సీఎం క్యాంప్‌ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. కాసేపు క్యాంప్‌ ఆఫీసులో అధికారులతో మాట్లాడిన తర్వాత.. ఆ ఆవరణలోనే ఉన్న తన బస్సులోకి వెళ్లి చంద్రబాబునాయుడు రాత్రి అక్కడే గడిపారు. అయితే చంద్రబాబునాయుడు అక్కడకు చాలా దగ్గరిలోనే రాష్ట్ర అతిథిభవనానికి మాత్రం వెళ్లకపోవడం గమనార్హం. దాన్ని ఇటీవలే రీమోడల్‌చేశారు కూడా. అయితే.. చంద్రబాబు వ్యక్తిగత వాస్తు సలహాదారుడు వారించినందువల్లనే ఆ గెస్ట్‌హౌస్‌కు వెళ్లలేదని సమాచారం. అయితే కొంత మంది మాత్రం క్యాంప్ ఆపీస్ లో బెడ్ రూంలు సిద్దంగా లేదని అందుకే బాబుగారు బస్సులోనే నిద్ర చేశారని అంటున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Slept  BUs  Guest house  camp office  

Other Articles