GHMC | Chandrababu naidu | New house | Babu house | Telangana | ap

Ghmc oficers respond on chadrababu naidu new house

GHMC, Chandrababu naidu, New house, Babu house, Telangana, ap

GHMC oficers respond on chadrababu naidu new house. GHMC officers said that the chandrababu constrcting house did follwing the rules.

బాబు కొత్త ఇంటికి అనుమతి ఎందుకు ఇవ్వలేదంటే..

Posted: 06/19/2015 09:11 AM IST
Ghmc oficers respond on chadrababu naidu new house

చంద్రబాబు నాయుడు కొత్త ఇంటి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో సీమాంధ్రుల పరిస్థితి ఇదీ అంటూ బాబు తన ఇంటి పర్మిషన్ గురించి చెప్పిన విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. తన కొత్త ఇంటికి హైదరాబాద్ లో ఇప్పటి వరకు అనుమతి లభించలేదని... తెలంగాణ సర్కార్ సీమాంధ్రుల పై ఎలాంటి వైఖరితో ఉందో అంటూ వివరించారు చంద్రబాబు నాయుడు. జూబ్లీహిల్స్‌ కోఆపరేటీవ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లకు ప్లాట్లు (నంబర్‌ 1309, 1310) ఉన్నాయి. పాత ఇంటి స్థానంలో కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలని చంద్రబాబు భావించారు. దీనికి అనుమతి ఇవ్వాలని గతనెల 18వ తేదీన జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 2073 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్‌ + రెండంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి కోరారు. జీ+2 వరకు నిర్మాణం 10 మీటర్ల లోపు ఉంటుంది. అయితే... మూడో ఫ్లోర్‌లో పూర్తిస్థాయిలో నిర్మాణం కాకుండా... పాక్షికంగా శ్లాబ్‌, కిటికీలు ఏర్పాటు చేస్తామని ప్లాన్‌లో పొందుపర్చినట్లు సమాచారం. దీంతో మొత్తం భవనం ఎత్తు 13 మీటర్లకు పెరుగుతుంది. ఇక... నిబంధనల ప్రకారం సెట్‌ బ్యాకులు కూడా నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువే వదిలారు. బిల్డింగ్‌ ప్లాన్‌ను పరిశీలించిన జీహెచ్‌ఎంసీ అధికారులు ఈనెల 16న చంద్రబాబు ఇంటి నిర్మాణానికి అనుమతి నిరాకరిస్తూ ఫైలు తిప్పి పంపించారు.

అయితే దానిపై తెలంగాణ సర్కార్ కు సమాచారం అందింది. చంద్రబాబు నాయుడు కొత్త ఇంటి వ్యవహారంపై జిహెచ్ఎంసీ స్పందించింది. భవనం ఎత్తు, సెట్‌బ్యాక్‌లు నిబంధనలకు అనుగుణంగా లేవని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు. తాము అనుమతి ఇవ్వకుండానే నిర్మాణ పనులు ప్రారంభించారన్నారు. అందుకే ఫైలును తిప్పి పంపించినట్లు చెప్పారు. ఏపీ సచివాలయ ఆస్తి పన్నుకూ, దీనికీ ఎలాంటి సంబంధం లేదన్నారు. మొత్తం 2300-2400 చదరపు గజాల స్థలం ఉండగా.. 2073గజాల్లో మాత్రమే భవనం నిర్మిస్తున్నట్లు ప్లాన్‌లో పేర్కొన్నారు. మిగతా స్థలానికి సంబంధించిన వివరాలు ఇవ్వలేదని తెలుస్తోంది. చంద్రబాబు ఇంటి ఎత్తు ప్లాన్‌లో 13మీటర్ల వరకు ఉందని, జూబ్లీహిల్స్‌ కో ఆపరేటీవ్‌ సొసైటీలో 10 మీటర్ల వరకే అనుమతి ఉంది. అలా మొత్తానికి చంద్రబాబు నాయుడు ఇంటికి ఎందుకు అనుమతి ఇవ్వలేదో వివరించారు. మరి దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  Chandrababu naidu  New house  Babu house  Telangana  ap  

Other Articles