Nagarjunasagar Tail Pond turns another flash point between Telangana and Ap Governments

Another controvesary rocks between telangana and ap governments

another controvesary rocks between Telangana and Ap Governments, cash for vote, note for vote, phone tapping, nagarjuna sagar tail pond, renta chintala, new controversary,Telangana and Ap Governments, telangana government, Ap government, pulichintala, Telangana Energy department secretary adravind kumar, police security, tail pond, Energy department secretary ajay jain, gurajala rdo murali, mro ramulu naik

Telangana writes to Andhra Pradesh seeking administrative powers to control NSP Tail Pond Project. Andhra Pradesh steps up security, drafts 300 policemen.

ITEMVIDEOS: తెరపైకి టెయిల్ పాండ్ వివాదం.. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

Posted: 06/18/2015 03:10 PM IST
Another controvesary rocks between telangana and ap governments

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల మధ్య ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహరాం వెలుగుచూసిన క్రమం నుంచి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార పార్టీల మధ్య పరోక్ష యుద్దం వాతావరణం అలుముకున్న నేపథ్యంలో.. ఇదే సమయంలో అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుక అనుకూల సమయంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సన్నధమవుతున్నాయి. ఆంద్రప్రధేశ్ సచివాలయానికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని నోటీసులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా టెయిల్ పాండ్ విషయమై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం.

రెంటచింతల మండలం సత్రశాల వద్ద నిర్మితమైన టెయిల్‌పాండ్‌ పూర్తిగా ఆంధ్రాప్రాంత పరిధిలో ఉంది. అయితే టేల్‌పాండ్‌ కూడా తమదే అంటూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీనికి సంబంధంచి ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఓ లేఖ కూడా రాసింది. రాష్ట్ర విభజన సమయంలో నాగార్జుసాగర్‌ ప్రాజెక్టు, దాని దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రా నిర్వాహణ కింద కేంద్రం అప్పజెప్పింది. అయితే సాగర్‌కు దిగువన....పులిచింతలకు ఎగువన ఉన్న సాగర్‌ టేయిల్‌పాండ్‌ నిర్వహణ బాధ్యతను ఏపీకి అప్పగించడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.
 
దీనిపై తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌ ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌కు లేఖ రాశారు. టెయిల్‌పాండ్‌ నిర్వహణా బాధ్యతలను తమకు అప్పగించి దాని వల్ల వచ్చే విద్యుత్‌ను మీరు ఉపయోగించుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు టేయిల్‌పాండ్‌ను తమ స్వాధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉందన్న సమాచారంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. గురజాల ఆర్డీవో మురళీ ఆదేశాలతో రెంటచింతల ఎమ్మార్వో రాములు నాయక్‌ 200 మంది పోలీసులతో టేయిల్‌పాండ్‌కు చేరుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

 

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : note for vote  phone tapping  nagarjuna sagar tail pond  renta chintala  AP  Telangana  

Other Articles