Lookoutnotices | ACB | KCR

Telangana govt plans to issue lookout notices on cash for vote case

phone tapping, revanth reddy, Lookoutnotices, ACB, KCR

Telangana Govt plans to issue lookout notices on cash for vote case. Telangana govt likely to issue lookout notices to 21 members who involved in cash for vote case.

ఓటుకు నోటు కేసులో లుకౌట్ నోటీసులు జారీ..!

Posted: 06/17/2015 12:39 PM IST
Telangana govt plans to issue lookout notices on cash for vote case

ఓటుకు నోటు వ్యవహారంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అటు ఏపి ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై తర్జన భర్జలు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిజిపిలు, ముఖ్య పోలీస్ అధికారులు  భేటీ అవుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. హైదరాబాద్ లో ప్రస్తుతం వాతావరణం కూల్ గా ఉన్నా కానీ రాజకీయ వాతావరణం మాత్రం వేడిగా మారింది. రెండు రాష్ట్రాలకు చెందిన కీలక వ్యక్తులు, అధికారులు వరుస భేటీలతో వాతావరణాన్ని వేడెక్కించారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిలో తెలంగాణ డిజిపి, ఏసీబీ డిజి, సిపి మహేందర్ రెడ్డిలు భేటీ అయ్యారు. అటు మరోపక్క ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఏపి డిజిపి, ఏసీబీ డిజి భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు.

అయితే ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ సర్కార్ కు ధీటుగా జవాబివ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ వ్యూహాలపై చర్చించింది. తెలంగాణ సిఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. తెలంగాణ డిజిపి, ఏసీబీ డిజిలు తర్వాత తీసుకునే చర్యల గురించి చర్చించారు. అయితే తాజాగా ఓటుకు నోటు కేసులో దాదాపు 21 మందికి లుకౌట్ నోటీసులు ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురు అనుమానితులు దేశం వదిలి పారిపోకుండా ముందస్తుగా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఈ రోజే లుకౌట్ నోటీసులను జారీ చేయవచ్చని చెబుతున్నారు. ఇంతమంది పైన ఎల్ఓసీ జారీ చేయడం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నసమయంలోను ఎప్పుడు జరగలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : phone tapping  revanth reddy  Lookoutnotices  ACB  KCR  

Other Articles