ap | Police | Hyderabad | Recall

Ap dgp order to return ap police from hyderabad

ap, Police, Hyderabad, Recall, Rayudu, Chandrababu, Telangana

Ap DGP order to return ap police from hyderabad. Ap DGP Rayudu recall ap police, who doing duties at hyderabad call them back to ap.

హైదరాబాద్ లో ఏపి పోలీసులు వెనక్కి.. ఎందుకో..?

Posted: 06/17/2015 10:38 AM IST
Ap dgp order to return ap police from hyderabad

తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయే ముందు హైదరబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేసింది కేంద్ర ప్రభుత్వం. రెండు రాష్ట్రాలు హైదరాబాద్ కేంద్రంగానే పదేళ్లపాటు పరిపాలన తదితరరాలను చూసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత దాదాపు అన్ని అంశాలను తెలంగాణ ప్రభుత్వమే టేకోవర్ చేస్తోంది. అయితే గత పదిహేను రోజులుగా సాగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా హైదరాబాద్ లో ఏపి పోలీసులకు మోహరించింది ఏపి ప్రభుత్వం. అవసరమైతే హఐదరాబాద్ లో ఏపి పోలీస్ట్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తామని ఏపి మంత్రులు ప్రకటించారు. అయితే హైదరాబాద్ లో ఉంటున్న తమకు రక్షణ లేదని సీమాంధ్రులు అనుకుంటున్నారని అందుకే వారి రక్షణకు ఏపి నుండి పోలీసులను రప్పించినట్లు తెలుస్తోంది. అయితే రెండు రోజులు క్రితం హైదరాబాద్ తెలంగాణ భూభాగంలోనిదని, ఏపిలో బాగం కాదని అలాంటప్పుడు ఏపి పోలీసులును ఎలా ఉ:చుతారని తెలంగాణ డిజిపి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

అయితే అనూహ్య పరిణామాల మధ్య ఏపి పోలీసుల్లో 400 మందిని తిరిగి తమ స్వంత రాష్ట్రానికి .పిలుపిస్తు ఏపి డిజిపి రాయుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే హైదరాబాద్ లోని పోలీసుల వ్యవహారం కాబట్టి గవర్నర్ కు ముందుగానే సమాచారమిచ్చారు ఏపి డిజిపి. అయితే ప్రస్తుతం ఉన్న ఏపి పోలీసుల్లో కేవలం 400 మందిని మాత్రమే తిరిగి పిలిపించారు. ఏపి అసెంబ్లీ, సచివాలయం, ఎన్డీఆర్ ట్రస్టు భవన్ లతో పాటు కీలక ప్రదేశాల్లో ఏపి పోలీసుల పహారా కొనసాగుతోంది. అయితే ఉన్నట్లుండి ఏపి పోలీసులను ఎందుకు తిరిగి రప్పించారన్నది ఆసక్తిగా మారింది. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేరుగా హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టిసారిస్తోందని అందుకే హైదరాబాద్ లో ఏపి పోలీసుల అవసరం లేదని ఏపి పోలీస్ బాస్ ఆలోచించినట్లు కొంత మంది అనుకుంటున్నారు.అయితే దీనిపై క్లారిటీ రావాలంటే ఏపి డిజిపి రాయుడు లేదంటే ఏపి ముఖ్యమంత్రి కానీ క్లారిటీ ఇవ్వాల్పిందే.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  Police  Hyderabad  Recall  Rayudu  Chandrababu  Telangana  

Other Articles