Telangana, ap, cash for vote, TDP, Tapping

Every body waiting to see what wil happen in coming twenty four hours

Telangana, ap, cash for vote, TDP, Tapping

Every body waiting to see what wil happen in coming twenty four hours. Telugu states cms clashes got peaks.

రానున్న 24 గంటల్లో ఏం జరగబోతోంది..?

Posted: 06/17/2015 09:09 AM IST
Every body waiting to see what wil happen in coming twenty four hours

తెలుగు రాష్ట్రాల్లో సెగ పుడుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బయటపడ్డ ఓటుకు నోటు వ్యవహారం కాస్తా.. చిలికి చిలికి గాలి వానగా మారింది. ఓటుకు నోటు వ్యవహారం కాస్తా రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. హైదరాబాద్ లొ తమకు రక్షణ లేదని కాబట్టి సెక్షన్ -8 అమలు చెయ్యాలని ఏపి ప్రభుత్వం పట్టుబడుతోంది. అయితే సెక్షన్ 8 కు ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకునేది లేదని తెలంగాణ సర్కార్ తేల్చిచెప్పింది. అయితే తెలంగాణ సర్కార్ దూకుడుకు కళ్లెం వెయ్యాలని ఏపి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే  ఢీ అంటే ఢీ అంటూ సవాల్ విసురుతోంది. అయితే రానున్న 24 గంటల్లో తెలంగాణ సర్కార్ కు షాక్ ఇస్తామంటూ ఏపి ప్రభుత్వం తరఫున హెచ్చరికలు  జారీ అయ్యాయి. అయితే ఏపి ప్రభుత్వం చేసిన హెచ్చరికల తర్వాత తెలంగాణ సర్కార్ మరింత స్పీడ్ పెంచింది. ఓటుకు నోటు కేసులో వేం నరేందర్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో పాటు, సండ్ర వీరయ్యను వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే ఏపి ప్రభుత్వం అంటున్నట్లు రానున్న 24 గంటల్లో ఏం జరుగుతుందన్నది ఆసక్తి రేపుతోంది.

తెలంగాణ ప్రభుత్వం ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా, మంత్రులు, కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేసిందని ఏపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఇదివరకే దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది ఏపి ప్రభుత్వం. అయితే కేంద్రం పెద్దగా ఇన్వాల్వ్ కాకపోవడంతో నేరుగా తెలంగాణ ప్రభుత్వానికి బదులివ్వాలని ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ట్యాపింగ్ వ్యవహారంలో ఇద్దరు ఐపియస్ లు, ఒక ఐఎఎస్, మరో ఇద్దరు కీలక వ్యక్తుల వివరాలు 24 గంటల్లో చెబుతామని ఏపి ప్రభుత్వం తెలిపింది. దాంతో ట్యాపింగ్, ఓటుకు నోటు వివాదం కొత్త మలుపు తిరిగింది. రానున్న 24 గంటల్లో రెండు రాష్ట్రాల మధ్య ఏం జరగబోతోంది అని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే మరోపక్క రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చడానికి కేంద్రం తరఫున కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శితో కూడిన బృందం ఒకటి హైదరాబాద్ కు రానుంది. అయితే ఈ 24 గంటల్లో ఏం జరుగుతోంది అని అటు మీడియా వాళ్లు, తెలుగు వారు ఎదురుచూస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  ap  cash for vote  TDP  Tapping  

Other Articles