journalist | Uttarpradesh | Motorcycle | attack on journalist

Journalist dragged behind motorcycle in uttarpradesh

journalist, Uttarpradesh, Motorcycle, attack on journalist

Journalist Dragged Behind Motorcycle in Uttarpradesh. A journalist in Uttar Pradesh's Pilibhit district was brutally assaulted and then tied to a motorcycle and dragged for about 100 metres on Sunday, allegedly for his report on dubious land deals.

జర్నలిస్ట్ ను బైక్ కు కట్టి ఈడ్చుకెళ్లారు

Posted: 06/15/2015 10:00 AM IST
Journalist dragged behind motorcycle in uttarpradesh

యూపీలో జర్నలిస్టు జగేంద్రసింగ్ దారుణ హత్యను మరచిపోకముందే మరో జర్నలిస్టుపై హత్యాయత్నం జరిగింది. పిలిభిత్‌లో ఓ భూ కబ్జా కేసును హైలైట్ చేసిన హైదర్‌ఖాన్ అనే టీవీ రిపోర్టర్ దుండగుల కిరాతకానికి గురయ్యాడు. దుండగులు అతన్ని బైక్‌కి కట్టేసి లాక్కుపోవడంతో తీవ్ర గాయాలకు గురై సృహ కోల్పోయాడు. ఖాన్ ఓ న్యూస్ ఛానెల్‌కు స్ర్టింగర్‌గా పనిచేస్తున్నాడు. యాక్సిడెంట్‌లో దొంగ ఒకడు గాయపడ్డాడని అతనికి ఈనెల 13న సమాచారం అందడంతో వివరాలు తెలుసుకునేందుకు ఖాన్ బిల్‌హరి గ్రామానికి వెళ్లాడు. అయితే అక్కడ అరవింద్ ప్రకాష్ అనే గూండా తన అనుచరులతో ఖాన్‌ను మోటారు సైకిల్‌కు కట్టేసి లాక్కువెళ్లాడు. గాయపడిన ఖాన్‌ను వదిలేసి పరారైయ్యాడు.

ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితుడ్ని కొందరు రక్షించి పిలిభిత్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దృష్టిలోపంతో బాధపడుతున్న తన సోదరుడికి చెందిన ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని అరవింద్ ప్రకాష్ కబ్జా చేశాడని ఖాన్ రిపోర్టు చేయడంతో అతనిపై అరవింద్ కక్ష గట్టాడు. ఆ భూమిని తనపేరిట బదిలీ చేయాల్సిందిగా కోరుతూ ఆ గూండా కొన్నిరోజులక్రితం తన తండ్రిని తీవ్రంగా కొట్టాడని, దీన్ని తాను బయటపెట్టడంతో అరవింద్ తనపై హత్యాయత్నం చేశాడని హైదర్‌ఖాన్ అంటున్నాడు. కాగా అరవింద్ ప్రకాష్‌పైన, అతని కొడుకుతోసహా మరో ఇద్దరిపైన కేసు నమోదు చేశామని, వారికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : journalist  Uttarpradesh  Motorcycle  attack on journalist  

Other Articles