తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఉపయోగిస్తున్న వాహనం కండిషన్ మీద అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక రాష్ట్ర ఆర్థికమంత్రి ఉపయోగించే వాహనానికి ఉన్న నాలుగు టైర్లూ బాగా అరిగిపోయినా వాటిని మార్చకపోవడం నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. రోడ్డు ప్రమాదంలో పల్టీలు కొట్టిన వాహనం వెనకవైపు టైరు బరస్ట్ అయినట్లు ఫొటోలలో స్పష్టంగా కనిపిస్తోంది. ముందు టైర్లు, వెనక టైర్లు కూడా బాగా అరిగిపోయాయి.
ఇదే వాహనం ఇంతకుముందు నెలరోజుల క్రితం ఒకసారి ప్రమాదానికి గురైంది. అప్పట్లో తాడిచెట్టును ఢీకొన్న ఈ వాహనం బాగా ధ్వంసమైంది. తర్వాత దానికి మరమ్మతులు చేయించారు. కనీసం ఆ సమయంలోనైనా వాహనం టైర్ల గురించి పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. సుదూర పర్యటనలకు సైతం ఉపయోగించే అధికారిక వాహనం టైర్లు అరిగిపోయినా.. వాటిని మార్చాల్సిన సమయం మించిపోయినా పట్టించుకోకుండా వదిలేయడం వల్లనే అది అదుపుతప్పి బోల్తాపడిందా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
కాగా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన మంత్రి ఈటల రాజేందర్కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్లోని అపోలో రీచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేందర్తో ఆయన మాట్లాడారు. కాగా, మంత్రి రాజేందర్కు తగిలినవి స్వల్ప గాయాలేనని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ బోయినపల్లి వినోద్ తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more