KTR | Chandrababu | Votefornote | TDP

Telangana minister ktr said that chandrababu trying to escape from the note for vote scandal

ACB investigation ,chandrababu naidu, note to vote case,ktr

Telangana Minister KTR said that chandrababu trying to escape from the note for vote scandal. But Chandrababu naidu cant escape.

ఢిల్లీలో ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పించేకోలేరు

Posted: 06/11/2015 08:21 AM IST
Telangana minister ktr said that chandrababu trying to escape from the note for vote scandal

ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ మీద తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. చంద్రబాబు ఢిల్లీలో ఎవరి కాళ్లు పట్టుకున్నా శిక్ష నుండి తప్పించుకోలేరని వెల్లడించారు. నోట్ల కట్టలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన విషయం దేశం మొత్తం చూసింది. మా బాసు చంద్రబాబు చెబితే చేస్తున్నానని రేవంత్‌రెడ్డి చాలా స్పష్టంగా చెప్పి చంద్రబాబు నిజస్వరూపాన్ని, నగ్న స్వరూపాన్ని కెమెరా ముందు బట్టబయలు చేశారని ఆయన తెలిపారు. చంద్రబాబు తాను నీతిమంతుడినని, 30 ఏళ్లుగా రాజకీయాల్లో నిప్పును, కంది పప్పునని చాలా మాటలు చెప్పి దొరికిపోయారని అన్నారు.  టీడీపీకి సిగ్గు, నీతి, విలువలు ఉంటే రేవంత్‌రెడ్డి చేసింది తప్పా? కాదా? చెప్పాలి. తప్పుగా భావిస్తే ఎందుకు సస్పెండ్ చేయడం లేదు? మీ ఎమ్మెల్యే చేసిన పనికి అమోదం తెలుపుతున్నారా? తెలిపితే మీరు దొంగలు కాదా? మీ పార్టీ మొత్తం దొంగల ముఠా కాదా? మా ఎమ్మెల్యేలను పశువుల మాదిరిగా కొంటున్నారని మహానాడులో పెద్ద డైలాగులు కొట్టావే.. ఇప్పుడు నువ్వేం చేశావ్. ఢిల్లీలో ఎవరి కాళ్లు పట్టుకున్నా చట్టం ఎవరికీ చుట్టం కాదు. కేంద్రం ఎదుట మోకరిల్లినా శిక్ష నుంచి తప్పించుకోలేవు అని కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్‌లోని ఇంటికి బందోబస్తుగా ఉన్న తెలంగాణ పోలీసులను చంద్రబాబు మార్చేసి ఏపీ పోలీసులను పెట్టుకున్నారని, పాలు, కూరగాయాలు, నీళ్లు కరెంట్‌ను ఆంధ్ర నుంచే తెచ్చుకుంటావా అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. మీరు ఏపీ సీఎం కావొచ్చు.. తెలంగాణ ఓటరువనే విషయాన్ని మరిచిపోవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పౌరుడిగా తప్పు చేసి అడ్డంగా దొరికిపోయావు.. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేశారని టీడీపీ నేతలంటున్నారు.. అంటే బాబు తప్పును ఒప్పుకున్నట్లేనన్నారు. మొత్తానికి అటు తండ్రి కేసీఆర్, ఇటు తనయుడు కేటీఆర్ మీద విమర్శల వర్షం కురిపించారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రితో మీటింగ్ లతో బిజీగా ఉన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ACB investigation  chandrababu naidu  note to vote case  ktr  

Other Articles