Ap cabinet discussed on phone tapping row, section 8 of ap bifurcation law

Ap cm to raise phone tapping issue with centre

yanamala Ramkrishnudu, ap cabinet, note for vote case, revanthreddy, cashfor vote controversy case, chandrababu, chandrashekar Rao, KCR, Telangana government, Revanth reddy, Telangana TDP, Harikrishna, ntr legacy, note fot vote case, bribery case, Telangana mlc elections, stephen, nominated mla stephen, ACB, anti corruption bureau, AK Khan, KTR, nara lokesh, pavan kalyan, jr ntr, Ap government, ap cm chandrababu, ysrcp, ys jagan

The Andhra Pradesh cabinet decided to complain to the Centre against Telangana over the alleged phone-tapping of Chief Minister N. Chandrababu Naidu and others.

ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి పిర్యాదు, సబ్ కమిటీ ఏర్పాటు..

Posted: 06/09/2015 09:47 PM IST
Ap cm to raise phone tapping issue with centre

ఓటుకు నోటు కేసులో నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ఫోన్ టేపులు వెలుగుచూసిన తరువాత తొలిసారిగా భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఫోన్ ట్యాపింగ్ విషయమై సుదీర్ఘంగా చర్చించింది. దీంతో పాటు హైదరాబాద్ నగర శాంతి భద్రతల వ్యవహారం మొత్తం గవర్నర్ చేతిలో వుండేలా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 ని ఖచ్చితంగా అమలు చేయాలని నవ్యాంధ్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్రానికి నివేదించాలని, దీంతో పాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్ర రాష్ట్రం నష్టపోయిన అనేక అంశాలపై చర్చించామని రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.

ఫోన్ ట్యాప్ చేశామని చెప్పి వదంతులు వ్యాపింపజేయడం సరికాదని యనమల అన్నారు. అవసరమైనట్లు కేసును మార్చుకుని ఏపీ ప్రభుత్వాన్ని బదనాం చేశారని తెలిపారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని నాశనం చేసేందుకు ఇలా చేశారని, ఈ విషయాన్ని తాము చాలా సీరియస్ గా తీసుకున్నామని, కేంద్ర హోంమంత్రికి నివేదిక తప్పకుండా ఇస్తామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంపై ముగ్గురు కేబినెట్ మంత్రులతో కమిటీ వేస్తున్నామని తెలిపారు.

దాదాపు 125 టేపులు రికార్డు చేసినట్లు తమ వద్ద సమాచారం ఉందని, అసలు టేపులు ఎక్కడనుంచి వచ్చాయి? ఎందుకు వాటిని ప్రసారం చేయాల్సి వచ్చిందో తేలాల్సినవసరం ఉందని చెప్పారు. టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ నేరమని, అది చట్ట విరుద్ధమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాము ఎన్నిసార్లు గవర్నర్ కు నివేదించుకున్నా విభజన చట్టంలోని అంశాల విషయంలో ఎలాంటి మేలు జరగలేదని చెప్పారు.

క్యాబినెట్ చర్చించిన ఇతర అంశాలు.. యనమల మాటల్లోనే...

* ఫోన్ ట్యాపింగ్ విషయంలో న్యాయపోరాటానికి సిద్దం
* చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయమై సుదీర్ఘంగా చర్చించాం
* ట్యాపింగ్ గుట్టను తెలుసుకునేందుకు ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీ
* ఫోన్ ట్యాపింగ్ రాజ్యంగ విరుద్దమైన చర్య
* ఫోన్ ట్యాపింగ్ వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన అంశం
* చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ లో పాల్గోన్న అధికారులను ఎట్టి పరిస్థితుల్లో వదలం
* తెలంగాణ ప్రభుత్వం వ్యక్తత్వ దాడికి పాల్పడింది
* ఫోన్ ట్యాపింగ్ తో గతంలో కొన్ని ప్రభుత్వాలే పడిపోయాయి
* ఈ విషయంలో గవర్నర్ చర్యలు తీసుకోవాలని భావించాం
* ఇరు తెలుగు రాష్ట్రాలను గవర్నర్ సమంగా చూడాలి
* తెలంగాణ సర్కారు కక్షపూరిత చర్యలను మానుకోవాలి
* హైదరాబాద్ లో సెక్షన్ 8 ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయం
* విభజన చట్టంలో సెక్షన్ 8పై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రేపు కేంద్రానికి వివరిస్తాం
* నవ్యాంధ్రకు జరిగిన అన్యాయంపై చర్చించాం
* ఫోన్ ట్యాపింగ్ అంశంపై రేపు కేంద్రమంత్రులకు వివరించనున్న సీఎం
* కేంద్రమంత్రులు రాజనాథ్ సింగ్ లో పాటు
* విభజన అంశంలో అమలు కావాల్సిన అంశాలపై చర్చించాం

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  note for vote case  revanthreddy  yanamala Ramkrishnudu  ap cabinet  phone tapping  

Other Articles