Revanth Reddy | Engagement | Chandrababu | Lokesh

May chandrababu naidu and ap ministers telangana leaders will attend the revanth reddy daughters engagement

Revanth Reddy, Engagement, Chandrababu, Lokesh

May chandrababu naidu and ap ministers, telangana leaders will attend the Revanth Reddy daughters engagement. Chandrababu naidu instruct the TDP cader to attend the Revanth Function.

రేవంత్ కూతురి నిశ్చితార్థానికి బాబు అండ్ కో..!

Posted: 06/09/2015 03:30 PM IST
May chandrababu naidu and ap ministers telangana leaders will attend the revanth reddy daughters engagement

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జైలులో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ కీలక నేత రేవంత్ రెడ్డి ఇంట్లో జరుగనున్నమొదటి శుభకార్యానికి హాజరుకావాలని అనుకుంటున్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యుులతో పాటుగా, ఏపి మంత్రులు, తెలంగాణ నేతలు అందరూ రేవంత్ రెడ్డి కూతురి నిశ్చితార్థానికి హాజరుకావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎంతో కీలకంగా మారిన రేవంత్ రెడ్డి కుటుంబానికి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా అండగా ఉండాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రేవంత్ రెడ్డి వ్యవహారంతో అటు తెలంగాణ, ఇటు ఏపి నేతలను ఒక్కచోటికి చేర్చి భవిష్యత్ ప్రణాళికలు కూడా రేవంత్ ఇంటి నుండే ప్లాన్ చేస్తారని కూడా సమాచారం.

నారా చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్ లతో పాటుగా ఏపి మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, చిన్నరాజప్పలతో సహా మొత్తం ఏపి కేబినెట్ లోని మంత్రులు, కీలకనేతలు అలాగే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావ్, మోత్కుపల్లితో తెలంగాణ తెలుగుదేశం క్యాటడర్ రేవంత్ రెడ్డి కూతురి నిశ్చితార్థానికి హాజరు కావాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తానికి రేపు కోర్టులో రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ హియరింగ్ ఉండగా ఒకవేళ బెయిల్ దొరికినా.. దొరకకపోయినా కానీ రేవంత్ రెడ్డి ఇంట్లో చేస్తున్న మొదటి శుభకార్యం కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వెయ్యకూడదని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు నిర్ణయించారట. మొత్తానికి రేవంత్ రెడ్డి ఇంటికి రేపు చంద్రబాబుతో సహా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం తరలివెళుతున్నట్లు దాదాపుగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Engagement  Chandrababu  Lokesh  

Other Articles