centre, lg, and his police trying to bring emergency like situation in delhi, criticises aap

Aap cries foul on law minister jitendra singh tomar arrest

Jitendra Singh Tomar, Delhi, Aam Aadmi Party, Sanjay Singh, Tilak Manjhi Bhagalpur university, Fake certificate row, Lieutenant Governor Najeeb Jung, Aam Admi Party, AAP founder presidentDelhi Law Minister, Delhi Police, Narendra Modi government, Aam Aadmi Party, Najeeb Jung, Arvind Kejriwal, Delhi law minister arrested, law ministrer arrested

AAP criticises union government, Lieutenant Governor, and his police on the arrest of Delhi Law Minister and Aam Aadmi Party (AAP) leader Jitendra Singh Tomar in connection with the fake degree row.. Questions can the same police arrest smruti irani and ram shankar katheria without notice

ఢిల్లీలో ‘ఎమర్జెన్సీ’ లాంటి పరిస్థితి తీసుకోస్తున్నారు

Posted: 06/09/2015 12:42 PM IST
Aap cries foul on law minister jitendra singh tomar arrest

ఆమ్ ఆద్మీ పార్టీకి నాయకుడు, ఢిల్లీ న్యాయశాఖ మంత్రిని ఇవాళ పోలీసులు అరెస్టు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సంపూర్ణ ప్రజా బలంతో వచ్చిన తమపై కేంద్రం ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ఢిల్లీ పోలీస్ కమీషనర్ కలసి ఎమర్జెన్సీ లాంటి పరిస్థితిని తీసుకువస్తున్నారని ఆఫ్ అరోపించింది. కేంద్రం చేతిలో కీలుబోమ్మగా మారిన లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ పోలిస్ కమీషనర్ కలసి తమ ప్రభుత్వాన్ని కూలదోయాలని యత్నిస్తున్నారని, తమ మంత్రులను, ఎమ్మెల్యేలను భయకంపితుల్ని చేస్తున్నారని ఆఫ్ అరోపించింది. తమ ప్రభుత్వానికి చెందిన మంత్రిని అరెస్టు చేసే క్రమంలో ఢిల్లీ పోలీసులు తమ శాసనసభాపతి అనుమతి ఎందుకు తీసుకోలేదని అప్ ప్రశ్నించింది. అరెస్టు చేసే క్రమంలో తమ అమాత్యుడిపై ఢిల్లీ పోలీసులు చేయి కూడా చేసుకున్నారని ఆప్ అరోపించింది.

నకిలీ సర్టిఫికెట్లతో న్యాయవాదిగా చలామణి అవుతున్న కేసులో మంత్రి జితేంద్రసింగ్ తోమర్ను అరెస్టు చేసిన పోలీసులు ఇవే అభియోగాలను ఎదుర్కోంటున్న కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ సహా రామ్ శంకర్ కఠారియాను కూడా పార్లమెంటు అనుమతి లేకుండా అరెస్టు చేయగలరా అని అప్ నేతలు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఢిల్లీలో ప్రజాబలంతో గెలిచిన తమపై.. కక్షగట్టిన కేంద్ర ప్రభుత్వం అనవసర రాద్దాంతాలతో ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేయనీయకుండా అడ్డుకుంటోందని అప్ నేతలు ఆరోపించారు. మంత్రిగా తోమర్ తాను ముందుగా నిశ్చయించుకున్న కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు మార్గమధ్యంలో అతడిని అరెస్టు చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆప్ అరోపించింది.

కాగా, ఢిల్లీ పోలీసులు మాత్రం శాసనసభాధిపతికి తాము తోమర్ అరెస్టు గురించి తెలియజేశామని చెబుతున్నారు. ఢిల్లీ స్పీకర్ కు తాము తోమర్ అరెస్టు విషయాన్ని ఫ్యాక్స్ ద్వారా తెలియజేశామని అంటున్నారు. అయితే అందుకు స్పీకర్ నుంచి అనుమతి లభించిందా అన్న ప్రశ్నలను మాత్రం ఢిల్లీ పోలీసులు దాటవేస్తున్నారు. తాము లెఫ్టినెంట్ గవర్నర్ అడుగుజాడల్లో నడుచుకోవడం లేదని, ఢిల్లీ ప్రభుత్వాన్ని, మంత్రులను భయకంపితుల్ని చేయాల్సిన అవసరం కూడా తమకు లేదని చెబుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aam Aadmi Party  jitendra singh tomar  fake law degree  AAP  

Other Articles