kcr slams chandrababu over note for vote case

Cm kcr fired on ap cm chandrababu over cash for vote row

maha sankalpa sabha, horsetrading, tdp bribe scam, kcr servant, TDP leaders, illogical explanations, cashfor vote controversy case, chandrababu, chandrashekar Rao, KCR, Telangana government, Revanth reddy, Telangana TDP, Harikrishna, ntr legacy, note fot vote case, bribery case, Telangana mlc elections, stephen, nominated mla stephen, ACB, anti corruption bureau, AK Khan, KTR, nara lokesh, pavan kalyan, jr ntr, Ap government, ap cm chandrababu, ysrcp, ys jagan,

Telangana Chief Minister KCR fires on AP Chief Minister Chandrababu over Phone tapping issue and revanth reddy case

అడ్డంగా దోరికినా.. బొంకుతున్నాడు.. బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు..

Posted: 06/08/2015 09:56 PM IST
Cm kcr fired on ap cm chandrababu over cash for vote row

ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డంగా దోరికిన తరువాత కూడా గాయ్ చేసిన పెడబోబ్బలు పెడతున్నాడని బోంకుతున్నాడని, ఆయనను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏ శాస్తి కావాలో ఆ శాస్తి తప్పక జరుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లో చంద్రబాబుకు ఏసీబీ ఉండొచ్చు గానీ, తాను మాత్రం ఆయనలా దొంగను కానని స్పష్టం చేశారు. హైదరాబాద్ పై హక్కుల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు.. హైదరాబాద్ నీ అబ్బ జాగీరా అంటూ మండిపడ్డారు. మంగళగిరిలో నిర్వహించిన మహా సంకల్ప సభలో చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు సీఎం కేసీఆర్ దీటుగా సమాధానమిచ్చారు. పట్టపగలు నగ్నంగా దొరికిపోయిన దొంగవు..ఇంకా నువ్వు మాట్లాడేదేంటని నిలదీశారు.

''పక్కరాష్ట్రం వాడివి నువ్వు.. అలాంటిది మా ఎమ్మెల్యేలను కొంటే చూస్తూ ఊరుకోవాలా? చేతులకు గాజులు తొడిగించుకుని కూర్చోవాలా? అంటూ ప్రశ్నించారు. నీతి నిజాయితీ గురించి అనుక్షణం మాట్లాడుతున్న చంద్రబాబు టీడీపీ పార్టీకి.. అసలు ఎమ్మెల్సీని గెలిపించుకునే బలం లేదని తెలిసి కూడా పోటీ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తే, తమ పార్టీకి చెందిన తెలంగాణ బిడ్డ స్టీఫెన్సన్ విషయం ఏసీబీకి చెప్పి మిమ్మల్ని పట్టించాడన్నారు. అయినా రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్లు.. సొంత రాష్ట్రం వచ్చినా చంద్రబాబు బాధ మాకు తప్పడం లేదన్నారు.

హైదరాబాద్కు హక్కుల గురించి మాట్లాడే చంద్రబాబు.. హైదరాబాద్ కు ముఖ్యమంత్రి ఎవరన్న విషయం తెలుసుకోవాలని..సూచించారు. నగ్నంగా.. పచ్చిగా  పట్టపగలు దొరికిపోయావ్.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా చంద్రబాబు బాగోతం బయటపడిందని దుయ్యబట్టారు.  సత్య హరిశ్చంద్రుడి ఇంటి వెనుక నీ ఇల్లు ఉందిగా.. నువ్వెందుకు చేసినవీ పని? అరువులతో ఏం చేయలేవు.. తెలంగాణ గడ్డపై చంద్రబాబు కిరికిరి చెల్లదని హెచ్చరించారు. తెలంగాణలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోడానికి తమకు రోజుకు 24 గంటలు సరిపోవడంలేదని... రోజుకు 18-20 గంటలు పనిచేయాల్సి వస్తోంది. అలాంటిది ఆయన గురించి పట్టిచుకోవాల్సిన ఖర్మ తమకేంటని నిలదీశారు? ఇక్కడ కూడా అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నాడని. ఏసీబీకి పట్టుబడితే, ఇరికిస్తున్నారని చంద్రబాబు అంటున్నారని ఇరికిస్తే ఇరికిపోతాడా.. చంద్రబాబు అంటూ వ్యంగంగా వ్యాఖ్యానించారు కేసీఆర్

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maha sankalpa sabha  cash for vote issue  TDP  chandrababu  KCR  

Other Articles