southwest monsoon reaches AP and Telangana, rains hit within 24 hours

Monsoon likely to hit ap and telangana by monday

Niruti ruthupavanalu, visakhapatnam meteorological department, coastal and rayalaseema, southwest monsoon, AP and Telangana, rains hit within 24 hours, visakhapatnam meteorological depertment, rain forecast

niruti ruthupavanalu reaches coastal and rayalaseema with in 24 hours says visakhapatnam meteorological depertment

వచ్చే.. వచ్చే తొలకరి వాన... జాంబడియేలో..

Posted: 06/07/2015 06:02 PM IST
Monsoon likely to hit ap and telangana by monday

ఎప్పుడెప్పుడోస్తావా..? అంటూ రైతులు ఎదురు చూపులు చూడాల్సిన అవసరం లేకుండానే ఈ సారి కాస్తా తొందరగానే వచ్చి తాకేందుకు సిద్దమయ్యింది నైరుతి రుతుపవనం. వానమ్మా.. వానమ్మా.. వానమ్మా.. ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మా అంటూ అన్నదాతల అంగలార్చకుండా వచ్చి మరో 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగాన్ని పలకరించనుంది నైరుతి తొలకరి జల్లు. అయితే భారత వాతావరణ శాఖ చెప్పినట్లుగా.. ఈ సారి వర్షపాతం తక్కువగానే పమోదవుతుందన్న నేపథ్యంలో తమను పలకరించనున్న తొలకరి.. కాస్త గట్టిగా జడిగా కురిస్తే.. విత్తనాలు వేసుకునే పనిలో వుంటామంటూ ఆశగా చెబుతున్నారు రైతన్నలు.

కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల వ్యవధిలో తాకనున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. విదర్భ నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు తీరం వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. పశ్చిమ  మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తం ఏర్పడిందని పేర్కొంది. ఈ రెండింటి ప్రభావం వల్ల కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles