Revanth Reddy, TRS, TDP, Telangana

Trs party leaders targets the telugudesam party leaders in telangana

Revanth Reddy, TRS, TDP, Telangana

TRS party leaders targets the telugudesam party leaders in telangana. The TRS party leaders warn the TDP leaders that if they didnt join into the TRS they also booked as Revanth Reddy.

రండి.. లేదంటే మీక్కూడా రేవంత్ గతి

Posted: 06/06/2015 01:52 PM IST
Trs party leaders targets the telugudesam party leaders in telangana

తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా మాటాల తూటాలు పేల్చడంలో ముందున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి. తన మాటల తూటాలతో అటు కేసీఆర్ ను,తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు రేవంత్ రెడ్డి. అయితే ముందు నుండి రేవంత్ ను టార్గెట్ చేసిన టిఆర్ఎస్ తాజాగా ఏసీబీ సహకారంతో ఓటుకు నోటుకు వ్యవహారంలో రేవంత్ ను ఆధారాలతో సహా పట్టించింది తెలంగాణ సర్కార్. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులను ఎంతో కాలంగా తమ పార్టీలోకి చేర్చుకుంటున్న టిఆర్ఎస్ పార్టీ తాజాగా ఓ వైపు ఆఫర్ అంటూనే మరో వైపు మాత్రం బెదిరింపులకు పాల్పడుతోంది. ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నిరుత్సాకహం నిండి ఉంది. ఈ టైంలోనే తెలంగాణ నేతలను టార్గెట్ గా చేసింది టిఆర్ఎస్.

నాలుగు రోజుల క్రితం ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన రేవంత్ రెడ్డి వ్యవహారాన్నే బూచిగా చూపుతోంది టిఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కనీసం కార్యకర్తలు కూడా లేకుండా ఖాళీ చేయించాలని టిఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తోంది. అందులో భాగంగానే టిఆర్ఎస్ నాయకులు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అయితే ఓ పక్క ఆపరేషన్ ఆకర్ష్ చేస్తూనే మరోపక్క ఒకవేళ మీరు గనక టిఆర్ఎస్ పార్టీలో చేరకపోతే మాత్రం రేవంత్ రెడ్డికి పట్టిన గతే మీకూ పడుతుంది అంటూ వార్నింగులు కూడా ఇస్తున్నారు. మొత్తానికి టిఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసిన్టుల రేవంత్ రెడ్డి బుక్కయ్యారు అనడానికి ఇదే నిదర్శనమని తెలంగాణ టిడిపి నేతలు అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి బూచి వల్ల ఎంత మంది తెలుగుదేశం నుండి టిఆర్ఎస్ పార్టీలోకి చేరతారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  TRS  TDP  Telangana  

Other Articles