Naralokesh, Chandrababu, capital, bhoomipooja, farmers

Narachandrababu naidu son naralokesh very busy at amaravati bhoomi pooja

Naralokesh, Chandrababu, capital, bhoomipooja, farmers

Narachandrababu naidu son naralokesh very busy at amaravati bhoomi pooja. Narachandrababu naidu participated in Ap capital bhoomi pooja, while the pooja lokesh greet every leader and fermers who gave land for capital.

చంద్రబాబు పూజ చేస్తుంటే లోకేష్ మాత్రం..

Posted: 06/06/2015 11:21 AM IST
Narachandrababu naidu son naralokesh very busy at amaravati bhoomi pooja

ఈ ఉదయం ఏపి రాజధాని అమరావతి భూమి పూజ అట్టహాసంగా ప్రారంభమైంది. చరిత్రలో నిలిచిపోయేలా ఏపి రాజధాని నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ తెల్లవారు జామున మూడు గంటలకు ప్రారంభమైన రాజధాని పూజలో.. నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు చంద్రబాబు భూమి పూజ నిర్వహించారు. అయితే చంద్రబాబుతో పాటు బార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అచ్చ తెలుగు సంప్రదాయంలో వచ్చిన చంద్రబాబు ఫ్యామిలి.. ముందు చంద్రబాబు దంపతులు తర్వాత నారా లోకేష్ లు పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అయితే బొడ్రాయి మీద సిమెంట్ వేసిన వెంటనే నారా లోకేష్ అక్కడి నుండి వెళ్లి పోయారు.

ఓ పక్క తన తండ్రి, ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజలో బిజీగా ఉంటే నారా లోకేష్ మాత్రం పూజ నుండి దూరంగా ఉన్నారు. అక్కడికి వచ్చిన నేతలను పలకరిస్తూ అందరితో కలియతిరిగారు. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చిన రైతుల గురించి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. సభలో ఎంత మందికి మాట్లాడే అవకాశం కల్పిస్తారు.. ఎవరెవరు వచ్చారు.. లాంటి వివరాలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి తండ్రి పూజలో బిజీగా ఉండటంతో అందరిని నారా లోకేష్ పలకరించారు. కొంత మంది యువ కార్యకర్తలతో, రైతులతో లోకేష్ ఫోటోలు కూడా దిగారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Naralokesh  Chandrababu  capital  bhoomipooja  farmers  

Other Articles