Narachandrababu, Promises, Elections, Janmabhoomi

Narachandrababu naidu gave clarity on his words about the promises in the eletions

Narachandrababu, Promises, Elections, Janmabhoomi

Narachandrababu Naidu gave clarity on his words about the promises in the eletions. Some media news papers wrote that chandrababu naidu back step on election promises.

ITEMVIDEOS: బాబు ఆ ఉద్దేశంతో అనలేదట..!

Posted: 06/05/2015 04:28 PM IST
Narachandrababu naidu gave clarity on his words about the promises in the eletions

నారా చంద్రబాబు నాయుడు మాట మార్చాడు.. ఎన్నికల హామీలపై మాట తప్పారు అంటూ వచ్చిన మీడియా కథనాలపై ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తాను ఒకటి చెబితే పేపర్లు మాత్రం మరొకటి రాస్తున్నాయని మండినపడ్డారు. తాను ఎన్ని కష్టాలు పడుతున్నా కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పానని.. అయితే మీడియాలో మాత్రం మరోలా వార్తలు వచ్చాయని అన్నారు. నిన్నటి జగన్ సమర దీక్షలో కూడా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై మాట నిలబెట్టుకోవడం లేదు అంటూ వీడియోలతో సహా ఎన్నికల సందర్భంగా బాబు చేసిన వాగ్దానాలను జనానినికి చూపించారు. మొత్తానికి తాను హామీల గురించి ఆ ఉద్దేశంతో అనలేదని చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చుకున్నారు.

ప్రకాశం జిల్లాలోని శీలంవారిపేటలో జన్మభూమి- మాఊరు కార్యక్రమ సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ.. పేదవారు ప్రమాదంలో చనిపోతే రూ.9లక్షల భీమా ఇప్పించనున్నట్లు వెల్లడించారు. పథకాల అమలులో దళారీ వ్యవస్థ పోవాలన్నారు. ప్రజలు, ప్రభుత్వం మధ్య దళారీ వ్యవస్థ అంతమయ్యేందుకు టెక్నాలజీని పెద్ద ఎత్తున్న వినియోగిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు తమ విజయాలను చంద్రబాబుకు వివరించారు. ఆడబిడ్డల కోసం ప్రతి డ్వాక్రా గ్రూప్ మెంబర్ కు పది వేల రూపాయలు ఇస్తున్నామని.. పాత బకాయిల కింద ఈ పది వేలను జమచెయ్యడానికి వీలులేదని కూడా బ్యాంకర్లకు సూచించినట్లు చంద్రబాబు వివరించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ లాంటి పథకాలకే ఎక్కువ నిధులు కేటాయిస్తామని బాబు వెల్లడించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narachandrababu  Promises  Elections  Janmabhoomi  

Other Articles