ACB, telangana, Revanth Reddy, Court, Lifethreat, Kondal Reddy, chandrababu, KCR

Revanth reddy facing life threat said revanth lawyer at court

ACB, telangana, Revanth Reddy, Court, Lifethreat, Kondal Reddy, chandrababu, KCR

Revanth Reddy facing life threat said revanth lawyer at court. The ACB officers reuest to custody of Revanth.

రేవంత్ రెడ్డి ప్రాణానికి ముప్పు..!

Posted: 06/05/2015 03:31 PM IST
Revanth reddy facing life threat said revanth lawyer at court

తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత, పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అరెస్టుతో తెలుగు రాష్ట్రాల్లో అలజడి రేగింది. అయితే తమ నేతను అన్యాయంగా అరెస్టు చెయ్యడంపై రేవంత్ రెడ్డి అభిమానులు ఒక్కసారిగా మండిపడ్డారు. అయితే గత కొంత కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మాటల తూటాలు పేలుస్తున్నరేవంత్ రెడ్డిని అరెస్టు చెయ్యడంతో తెలుగు రాష్ట్రాల్లో వేడిరాజుకుంది. అయితే రేవంత్ రెడ్డి ప్రాణానికి హాని ఉందంటూ అతని తమ్ముడు కొండల్ రెడ్డి ఏసీబీ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే కోపంతో తన అన్నను చంపాలని చూస్తున్నారని రేవంత్ తమ్ముడ కొండల్ రెడ్డి ఆరోపించారు. దాంతో రేవంత్ రెడ్డి ప్రాణానికి నిజంగా హాని ఉందా.. ఎవరైనా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారా..? అన్న అనుమానాలు తలెత్తాయి.

తాజాగా ఏసీబీ అధికారులు తమ కస్టడీకి రేవంత్ రెడ్డిని అప్పగించాలంటూ కోర్ట్ లో వాదించింది ఏసీబీ. అయితే రేవంత్ తరఫు లాయర్ మాత్రం ఏసీబీ కస్టడీకి ససేమీరా అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రాణానికి ముప్పు ఉంది అని లాయర్ వాదించారు. గత కొంత కాలంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మంత్రులు, ముఖ్యనేతలు చేస్తున్న స్టేట్మెంట్లు ఇందుకు నిదర్శనం అని లాయర్ వాదించారు. అయితే ఓటుకు నోటు స్కాంలో అరెస్టు చేసిన రేవంత్ రెడ్డిని పూర్తిగా విచారించడానికి ఐదు రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. అయితే రేవంత్ కు ప్రాణహాని ఉంది అని లాయర్ వాదించారు.  అయితే ప్రాణహాని ఉంది అంటున్న రేవంత్ కు ఎవరి వల్ల ప్రాణ హాని ఉంది..? పోలీసుల కస్టడీలో ఉన్నా కూడా ఎలాంటి ముప్పు ఉంది.? ప్రాణహాని ఉంది అని గతంలో ఎక్కడైనా చెప్పారా..? కనీసం అనుమానాలు ఏమైనా ఉన్నాయా..? ఇలా ప్రశ్నలకు రేవంత్ రెడ్డి, అతని లాయర్లే సమాధానాలు ఇవ్వాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ACB  telangana  Revanth Reddy  Court  Lifethreat  Kondal Reddy  chandrababu  KCR  

Other Articles