Finally Election commission given green signal for AP capital city bhumipuja programme | TDP Party

Election commission green signal bhumipuja programme andhra pradesh capital city

ap bhumi puja, ap capital city, capital city controversies, chandrababu naidu, tdp party news, election commission, bhumipuja programme

Election commission green signal bhumipuja programme andhra pradesh capital city : Finally Election commission given green signal for AP capital city bhumipuja programme with conditions.

ఏపీ రాజధాని భూమిపూజకు ‘షరుతుల’ గ్రీన్ సిగ్నల్

Posted: 06/04/2015 07:32 PM IST
Election commission green signal bhumipuja programme andhra pradesh capital city

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం గతేడాది నుంచి తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే! ఇటీవలే క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించి సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రభుత్వానికి అందించగా.. నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇక భూమి పూజకు కూడా చకచకాల పనులు జరుగుతున్నాయి. కానీ ఇంతలోనే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రస్తుతం ఏపి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీంతో ఏం చెయ్యాలో అర్థంకాని అధికారులు.. భూమి పూజకు, ఏడాది పాలన సందర్భంగా నిర్వహించనున్న సభకు అనుమతి ఇవ్వాలని ఏపి ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమీషన్ (సీఈసీ)కి లేఖ రాసింది.

ఏపీ ప్రభుత్వం వినతిని పరిశీలించిన సీఈసీ.. షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఎన్నికల కోడ్ అమలులో వున్నందున ఈనెల 5, 6, 8 తేదీల్లోనే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలిపింది. ఈ కార్యక్రమానికి ఎలాంటి ప్రకటనలు చేయవద్దని సూచించింది. అలాగే.. ఈనెల 8వ తేదీన జరిగే సభకు కొన్ని షరతులు వర్తిస్తాయని సీఈసీ పేర్కొంది. ఈ మేరకు ఐవైఆర్ కృష్ణారావుకు కేంద్రం ఎన్నికల సంఘం సమాచారం అందించింది. ఈ విధంగా సీఈసీ అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన టీడీపీ.. రాజధాని భూమి పూజ కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap capital city  bhumipuja programme  election commission  

Other Articles