టివీల్లో ఓ యాడ్ తరుచూ చూస్తుంటాం. ఓ చాక్లెట్ కు సంబందింన ఆ యాడ్ లో ఏం నాయనా లడ్డూ కావాలా..? మరో లడ్డూ కావాలా నాయనా..? అంటూ వస్తుంది. అచ్చం అలానే తెలంగాణలో టిఆర్ఎస్ నేతలకు లడ్డూల మీద లడ్డూలు వచ్చాయి. అవును లడ్డూలు ఎవరు ఇచ్చారు అనుకుంటున్నారా..? అదేం కాదు టిఆర్ఎస్ నాయకులకు స్వీట్ న్యూస్ ఒకదాపి వెంట మరోకటి క్యు కట్టాయి. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో టిఆర్ఎస్ శ్రేణులు తెగ సంబరపడ్డాయి. తెలంగాణ సర్కార్ లక్ష్యంగా గత కొంత కాలంగా తలనొప్పిగా మారిన రేవంత్ రెడ్డి వ్యవహారం సాక్షాలతో సహా బట్టబయలు కావడంతో సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. తమ అతినేతను మాటల తూటాలతో ఇబ్బందులకు గురిచేసిన తెలుగుదేశం పార్టీ కీలక నేత రేంవత్ రెడ్డి అరెస్టుతో టిఆర్ఎస్ సంబరాలు చేసుకుంది.
ఇక తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా బావిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఐదు స్థానాలను గెలుచుకోవడంతో టిఆర్ఎస్ వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. ఎంతో నాటకీయ పరిస్థితుల నడుమ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన ఐదుగురు అభ్యర్థులు గెలుపొందారు. దాంతో డబుల్ ధమాకా చేసుకున్నారు టిఆర్ఎస్ శ్రేణులు. ముందు నుండి అనుకుంటున్నట్లు నాలుగు ఎమ్మెల్సీ స్థానాల గెలుపు ఖాయంగా ఉన్న ఒక ఎమ్మెల్సీ స్థానం మీద కాస్త నీలినీడలు ఉండేవి. కానీ బిజెపి పార్టీ ఓట్లకు మొత్తానికి చెల్లకుండాపోవడం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నోటాకు ఓటు వెయ్యడం, అలాగే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి పొరపాటులేకుండా ఓటును వినియోగించుకోవడంతో ఐదో ఎమ్మెల్సీ కూడా ఖాయమైంది. దానికి తోడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కూడా ప్రారంభం కావడంతో ఫుల్ హ్యాపీస్ అంటున్నారు టిఆర్ఎస్ నాయకులు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more