వెన్నుపోటు నీ రక్తంలో ఉందిరా.. మీ నాన్న అంతే.. నువ్వు కూడా అంతే.. అంటే చాలా సార్లు అంటుంటారు. మనం వింటుంటాం కూడా. అయితే తాజాగా ఓ అధ్యయనంలో తేలిన విషయం వింటే నిజంగా అవాక్కవుతారు. అయితే సీరియల్ లో చూపించినట్లు అవాక్కు కాదు అంతకన్నా ఎక్కువే. ఇంతకీ విషయం ఏంటీ అంటే అవినీతి ఎక్కువగా చేస్తున్నారు అంటే వారిలో ఓ రకమైన హర్మోన్ ఎక్కువగా ఉంటుందట. అందుకే వాళ్లు అవినీతికి తెగబడతారట. మొత్తానికి సైంటిస్టులు భలే విషయాలను కనిపెట్టారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో అవినీతి మకిలీ అంటిన రేవంత్ రెడ్డి మ్యాటర్ హాట్ న్యూస్ గా మారిన టైంలోనే ఇలా అధ్యయన విషయం బయటకు రావడం నిజంగా యాదృచ్చికమే.
పురుషుల్లో సెక్స్ వాంఛను ప్రేరేపించే ‘టెస్టోస్టెరాన్’ హార్మోన్ ఎక్కువగా ఉన్న రాజకీయ నేతల్లో అవినీతి ఎక్కువగా ఉంటుందట. ఈ విషయం స్విడ్జర్లాండ్‌లోని లాసన్నే విశ్వవిద్యాలయం నిపుణులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. మానవుల్లో వృషణాలు టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయనే విషయం తెల్సిందే. ‘అధికారం అవినీతికి దారి తీస్తుంది. తిరుగులేని అధికారం అంతులేని అవినీతికి ఆస్కారమిస్తుంది’ అని చెప్పిన ఇంగ్లీష్ క్యాథలిక్ హిస్టారియన్, బ్రిటన్ పార్లమెంట్‌లో లేబర్ పార్టీ ఎంపీగా పని చేసిన రాజకీయవేత్త, రచయిత సర్ జాన్ డాల్‌బెర్గ్-యాక్షన్.... కొటేషన్‌లో వాస్తవాలను తెలుసుకునేందుకు లాసెన్నే విశ్వ విద్యాలయానికి చెందిన ప్రోఫెసర్ జాన్ ఆంటోనకిస్ నాయకత్వంలోని నిపుణుల బృందం జరిపిన తాజా అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
మొత్తానికి అవినీతి చేస్తున్నాడు అంటే వారి రక్తంలో హార్మోన్ల ప్రభావం వల్లే అంతే తప్ప అందులో అతడి తప్పు ఏమీ లేదని పరోక్షంగా అంటున్నారు సైంటిస్టులు. అయినా జీన్స్ ఎపెక్ట్, హర్మోన్ల ప్రభావం ఉంటే ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు లెండి. అయితే స్విడ్జర్లాండ్‌లోని లాసన్నే విశ్వవిద్యాలయం మ్యాటర్ తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లకు తెలిస్తే మాత్రం రేపు ఉదయాన్నే కోర్టులో పిటిషన్ వేస్తారోమో. తమ నాయకుడు కేవలం హార్మోన్ల ప్రభావం వల్లే అలా చేసి ఉంటాడు అంతే కానీ అతనికి ఎలాంటి దురుద్దేశం లేదు అంటూ కోర్టులో పిటిషన్ వేసినా ఆశ్చర్యపోనవసరం లేదేమో మరి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more