revanth reddy, Remand, Jail, Vote, MlC

Revanth reddy got 14 days remand on recent case

revanth reddy, Remand, Jail, Vote, MlC

Revanth reddy got 14 days remand on recent case. The judge clear that Revanth Reddy can utilise the vote in the MLC elections.

రేవంత్ రెడ్డికి 14రోజుల రిమాండ్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు లైన్ క్లీయర్

Posted: 06/01/2015 09:23 AM IST
Revanth reddy got 14 days remand on recent case

ఎమ్మెల్యేకు లంచం ఇస్తూ పట్టుబడిన ఎమ్మెల్సే రేవంత్ రెడ్డికి  14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి ఆదేశాలు జారీచేశారు.దీంతో రేవంత్ సహా మరో ఇద్దరు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉదయం ఎనిమిది గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి నివాసానికి రేవంత్ను తీసుకొచ్చిన అధికారలు సంబంధిత పత్రాలతో సహా ముగ్గురు నిందితులను న్యాయమూర్తి ముందుంచారు. ఎఫ్ఐఆర్ లో మొత్తం నలుగురు నిందితుల్ని చేర్చిన ఏసీబీ.. రేవంత్ రెడ్డిని ఏ1గా, సెబాస్టియన్ను ఏ2గా పేర్కొన్నారు. ఏ3గా ఉదయ్ని, ఏ4గా మ్యాథ్యూస్ను చేర్చారు.

అయితే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తన ఓటు హక్కను వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తు జడ్జీ ఆదేశాలు జారీ చేశారు. తనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉందని గట్టిగా వాదించడంతో జడ్జీ దీని మీద లిఖిత పూర్వంగా రాసివ్వాలని కోరారు. దాంతో రేవంత్ రెడ్డి తరఫున లాయర్లు వెంటనే తెల్లటి కాగితంపై రేవంత్ రెడ్డి తరఫున ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు. రేవంత్ రెడ్డి అభ్యర్తనను స్వీకరించిన జడ్జ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒటు హక్కు వినియోగించుకోవచ్చని తేల్చారు. అయితే కోర్టు నుండి నేరుగా అసెంబ్లీ కే తీసుకువెళతారా..? అన్నది పోలీసులు నిర్ణయించాలి. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత 14 రోజులు రిమాండ్ కు వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  Remand  Jail  Vote  MlC  

Other Articles